చిరువ్యాపారులకు ‘సేవా’

ABN , First Publish Date - 2021-10-31T06:34:06+05:30 IST

ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలు లభించక...మరో వైపు స్వయం ఉపాధి పొందుతామనుకుంటే పెట్టుబడు లు లేక...చిన్నచితక వ్యాపారులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వ్యక్తులకు అండగా ఉంటోంది ‘సేవా’ సంస్థ. చిరు వ్యాపారుల అవసరా లను ఆసరగా చేసుకొని అధిక వడ్డీలు గుంజి పీల్చి పిప్పి చేస్తున్న సం ఘటనలను అరికట్టడానికి సేవా సంస్థ ముందుకు వస్తోంది.

చిరువ్యాపారులకు ‘సేవా’

- వడ్డీ లేకుండా రుణాలు

- జిల్లాలో రూ. కోట్లలో టర్నోవర్‌..

జగిత్యాల, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలు లభించక...మరో వైపు స్వయం ఉపాధి పొందుతామనుకుంటే పెట్టుబడు లు లేక...చిన్నచితక వ్యాపారులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వ్యక్తులకు అండగా ఉంటోంది ‘సేవా’ సంస్థ. చిరు వ్యాపారుల అవసరా లను ఆసరగా చేసుకొని అధిక వడ్డీలు గుంజి పీల్చి పిప్పి చేస్తున్న సం ఘటనలను అరికట్టడానికి సేవా సంస్థ ముందుకు వస్తోంది. వడ్డీ మహ మ్మారి నుంచి చిరు వ్యాపారులను రక్షించడానికి సేవా సంస్థ నడుంబి గించి జిల్లాలో రూ. కోట్లలో వ్యాపారం నిర్వహిస్తూ....వందల సంఖ్యలో చి రు వ్యాపారులకు అండగా ఉంటూ శభాష్‌ అనిపించుకుంటోం ది. ఎటు వంటి వడ్డీ లేకుండా రుణాలను అందిస్తూ చిరు వ్యాపారులకు చేదోడు వాదోడుగా ఉంటోంది. సేవా మ్యూచ్‌వల్లి ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సేవా). సంస్థలో సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ఎటు వంటి వడ్డీలేని రుణాలను అందిస్తూ అండగా నిలుస్తోంది.


హ్యూమన్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 38 సేవా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని జగి త్యాల, కోరుట్ల, పెద్దపల్లి ప్రాంతాల్లో సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. జగి త్యాలలో 2017లో సేవా సంస్థను ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమా రు 864 మందికి సభ్యత్వం అందించారు. ఇందులో 564 మంది చిరు వ్యాపారులకు వివిధ రుణాలను అందించారు. జగిత్యాల బ్రాంచ్‌ ద్వారా సుమారు రూ. 1.94 కోట్లకు పైగా రుణాలను అందించారు. సభ్యుల వా టాదనం, డిపాజిట్ల రూపంలో ఇప్పటి వరకు రూ. 3.10 కోట్ల వరకు సేక రించారు. పాన్‌ షాపులు, పండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులు, పేదలే లక్ష్యంగా రుణాలను అందిస్తున్నారు. ఇందులో రుణం తీసుకున్నా, పొదు పు చేసిన ఎలాంటి వడ్డీ ఉండదు. కార్యాలయ నిర్వహణకు మాత్రమే నా మమాత్రపు రుసుమును స్వీకరిస్తుంటారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 38 బ్రాంచ్‌ల ద్వారా ఇప్పటివరకు 50,890 మందికి సభ్యత్వం కల్పించారు. సుమారు రూ. 53 కోట్ల డిపాజిట్లు సేకరించి, రూ. 15 కోట్ల రుణాలను అందించారు. సేవా సంస్థ ద్వారా అందిస్తున్న రుణాలను ఎటువంటి వడ్డీ ని వసూలు చేయడం లేదు. రుణం తీసుకున్న మూడు నెలల్లో రోజువా రిగా, వారం వారిగా, నెల వారిగా వాయిదా పద్ధతుల్లో చెల్లింపులు స్వీ కరిస్తున్నారు. ఒక్కో వ్యాపారి రుణం తీసుకొని సకాలంలో చెల్లించినట్లయి తే అవసరమైతే రెట్టింపు రుణాన్ని సైతం అందిస్తున్నారు. 

సభ్యులకు రుణాలు ఇలా...

సేవ సంస్థలో సభ్యత్వం తీసుకున్న అర్హులైన వ్యక్తులకు రుణాలను అందిస్తుంటారు. సభ్యుల వ్యాపారాభివృద్ధికి తొలుత రూ. 10 నుంచి రూ. 50 వేల వరకు రుణం అందిస్తున్నారు. రుణానికి ఎలాంటి వడ్డీ వసూలు చేయడం లేదు. విడతల వారిగా, రోజు వారిగా రుణం చెల్లించాల్సి ఉం టుంది. అప్పు చెల్లించాక సేవా రుసుము మాత్రమే తీసుకుంటారు.

గృహోపకరణాలకు సైతం...

సంఘ సభ్యులకు అవసరమైన గృహోపకరణాలకు సైతం రుణం అం దిస్తున్నారు. ఇంటి అవసరాలకు ఉపయోగపడే టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మిష న్‌, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రుణాలను ఇస్తున్నారు. వస్తు విలువను బట్టి పాతిక శాతం ముందుగా చెల్లిస్తే మిగితా మొత్తం రుణం గా అందిస్తున్నారు. తీసుకున్న రుణాన్ని సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లించాల్సి ఉంటోంది.

సభ్యులే భాగస్వామ్యులు...

సేవ సంస్థలో సభ్యత్వం తీసుకున్న ప్రతీ వ్యక్తి భాగస్వామిగా పరిగణి స్తారు. సభ్యత్వం తీసుకునే వారి గురించి పూర్తి విచారణ చేసిన అనంత రం సభ్యత్వం అందజేస్తుంటారు. సభ్యులకు రుణం పొందే అవకాశం క ల్పిస్తారు. ఇందులో డిపాజిట్‌ చేసిన వ్యక్తులు ఇతరులకు రుణాలను అందించడానికి సహాయ పడుతుంటారు.

హాజ్‌ యాత్రకు ప్రత్యేక ఖాతా...

జీవిత కాలంలో ఒక్కసారైన హాజ్‌ యాత్ర చేయాలని ప్రతి ముస్లిం సోదరులు భావిస్తుంటారు. హాజ్‌ యాత్ర చేయడానికి అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో నిరుత్సాహానికి గురవుతుంటారు. ఇందు కోసం సేవా సంస్థ ప్రత్యేకంగా ఉమ్ర ఖాతాను నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతీ రోజు రూ. 200 లేకుంటే నెలకు రూ. 5 వేల చొప్పున పొదుపు చేయాల్సి ఉంటోంది. పొదుపు చేసుకున్న ఖాతాదారులకు సంఘం హాజ్‌ యాత్రకు అవసరమైన విమానం టిక్కెట్లు, యాత్ర సందర్భంగా వసతిని కల్పిస్తు న్నారు. దీంతో పాటు బిజినెస్‌ గూడ్స్‌, కన్య్సూమర్‌ గూడ్స్‌ రుణాలను ఇస్తున్నారు.

నిజాయితీపైనే నమ్మకం...

షోయాబ్‌ ఉల్లాఖ్‌, అధ్యక్షుడు, సేవా కార్యాలయం, జగిత్యాల బ్రాంచ్‌

నిరుపేద వ్యక్తులకు వడ్డీ రహిత రుణాలను అందిస్తున్నాము. చిరు వ్యాపారులకు తోడ్పాటు ఇచ్చే విధంగా సంఘాన్ని నిర్వహిస్తున్నాము. ఎ లాంటి వడ్డీ వసూలు చేయడం లేదు. నిజాయితీగా ఉంటూ రుణాలను తీసుకోవడం, చెల్లించడంతోనే ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయి. ప్ర జలకు వడ్డీ లేని రుణాలను అందించడమే లక్ష్యంగా సంస్థను నిర్వహిస్తు న్నాము. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది

- యూసుఫ్‌ ఖాన్‌, రుణ గ్రహీత, చిరు వ్యాపారి, జగిత్యాల

పట్టణంలోని పురాణిపేటలో ఎలక్ట్రిషియన్‌ పనులు చేసుకుంటూ జీవ నోపాధి పొందుతున్నారు. సేవా సంస్థ ద్వారా రెండేళ్ల క్రితం తొలిసారిగా రూ. 50 వేలు వడ్డీ లేని రుణం పొందాను. సకాలంలో చెల్లించడంతో రూ. లక్ష రుణం మరో పర్యాయం అందించారు. దీంతో ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ వ్యాపారం ప్రారంభించారు. రూ. లక్ష సైతం సకాలంలో చెల్లించడంతో మరోమారు రూ. లక్ష వడ్డీ లేని రుణాన్ని అందించారు. సేవా సంస్థ వల్ల మా వ్యాపారం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతోంది. 


వడ్డీ లేని రుణం అందించడం సంతోషకరం

- రిజ్వాన్‌ ముజాహిద్‌, ఓ ఖాతాదారుడు, జగిత్యాల

సేవా సంస్థ ద్వారా వడ్డీ లేని రుణాన్ని రెండేళ్లలో మూడు పర్యాయా లు పొందాను. పట్టణంలోని టవర్‌ సర్కిల్‌ సమీపంలో డ్రెస్సెస్‌ దుకాణం నిర్వహిస్తున్నాము. వస్త్రాల పెట్టుబడికి డబ్బులు లేక అవస్థలు ఎదుర్కొం టున్న సమయంలో సేవా సంస్థ అందిస్తున్న రుణం విషయం తెలుసు కొని సంప్రదించి సభ్యుడిగా చేరాను. ఇప్పటివరకు మూడు పర్యాయాలు రూ. లక్ష చొప్పున రుణం తీసుకున్నాను. వడ్డీలేని రుణం అందిస్తుండడం సంతోషకరము. 

Updated Date - 2021-10-31T06:34:06+05:30 IST