విద్యుత్ కార్మికులవి న్యాయమైన డిమాండ్లు
ABN , First Publish Date - 2021-02-26T05:35:52+05:30 IST
విద్యుత్ కార్మి కులవి న్యాయపరమైన డిమాండ్లని మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్ప ష్టం చేశారు.

- మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి టౌన్, ఫిబ్రవరి 25: విద్యుత్ కార్మి కులవి న్యాయపరమైన డిమాండ్లని మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్ప ష్టం చేశారు. ఐఎన్‌టీయూసీ 327 యూని యన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విధ్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ పెద్దపల్లి జిల్లా ట్రాన్స్ కార్యాలయ ఆవరణలో గురువారం రెండు రోజులుగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షను సందర్శించి సంఘీభావం ప్రకటించిన అనంతరం విజయరమణారావు మాట్లాడారు. రాష్ట్రంలో తక్కువ వేతనాలతో పని చేస్తున్నది విద్యుత్ కార్మికులేనన్నారు. 25 వేల బేసిక్ జీతానికి 12వేలు చేతకందడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారింద న్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించాలని డి మాండ్ చేశారు. ఆపరేటర్లకు ఏపీఎస్‌ఈబీ నిబంధనలు వర్తింపజేయాలని, ఈపీఎఫ్ పిం ఛన్ విధానాన్ని రద్దు చేసి పాత జీపీఎఫ్ వి ధానాన్ని అమలు చేయాలన్నారు.. అలాగే కాం ట్రాక్ట్ కార్మికులను ఆపరేటర్లు గుర్తించాలని, ఏఎల్‌ఎమ్‌లను స్వంతజిల్లాలకు బదీలి చేయా లని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, భూతగగడ్డ సం పత్, తూముల సుభాష్, నెత్తెట్ల కుమార్, చం ద శంకర్, కట్కూరి సందీప్, నూగిళ్ళ వీరేష్. రాజు, రాజ్‌కుమార్, సూర్యనారాయణ, అశోక్‌కు మార్ తదితరులున్నారు.