విద్యుత్‌ సమస్యలు త్వరగా పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-05-30T05:36:45+05:30 IST

మండలంలోని అన్ని గ్రామాల్లోని విద్యుత్‌ సమస్యలను త్వరితగతిన పరిష్క రించాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు.

విద్యుత్‌ సమస్యలు త్వరగా పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

- జడ్పీ చైర్మన్‌

కమాన్‌పూర్‌, మే 29: మండలంలోని అన్ని గ్రామాల్లోని విద్యుత్‌ సమస్యలను త్వరితగతిన పరిష్క రించాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం విద్యుత్‌ శాఖ ఏడీ మహేందర్‌ బాబు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో విద్యుత్‌ తీగలు వేలాడకుండా క్రమ బద్ధీకరించాలని, అవసరమై న స్థలాల్లో మిడిల్‌ స్తంబాల ను ఏర్పాటు చేయాలన్నారు. త్వరలోనే అన్నిగ్రామాల్లో వి ద్యుత్‌ సమస్యలు లేకుండా చర్యలు చేపడతామని ఏడీ మహేందర్‌బాబు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీడీవో వెంకటేష్‌ జాదవ్‌ తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యు లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-30T05:36:45+05:30 IST