ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు

ABN , First Publish Date - 2021-05-03T05:10:05+05:30 IST

ఎన్నిక ఏదైనా ప్రజలు టీ ఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని ఇది నాగార్జున సాగర్‌ ఎన్ని కల్లో మరోసారి నిరూపితమైందని జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు.

ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, మే 2: ఎన్నిక ఏదైనా ప్రజలు టీ ఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని ఇది నాగార్జున సాగర్‌ ఎన్ని కల్లో మరోసారి నిరూపితమైందని జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎన్ని చౌకబారు విమర్శ లు చేసినా, ఇస్టానుసారంగా మాట్లాడినా ప్రజలు ఓటుతో సరైన సమాధానం చెప్పారన్నారు. కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన కేంద్ర నాయకులు ప్రచారం నిర్వ హించినా ప్రజలు సంక్షేమ సర్కారుకే పట్టం కట్టార న్నారు. దుబ్బాక ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గట్టెక్కి న బీజేపీ వాపును బలుపుగా భావించిందన్నారు.  కాని సాగర్‌ ఎన్నికల్లో బీజేపీకి కనీసం డిపాజిట్‌ కుడా రాని పరిస్థితి ఎదురైందన్నారు. సాగర్‌ ఎన్ని కల్లో విజయం సాధించిన విధంగానే కార్పొరేషన్లు, మున్సిపాలీటీలను సైతం తామే కైవసం చేసుకుం టామని పేర్కొన్నారు. కేసీఆర్‌ పాలనే రాష్ట్ర ప్రజల కు శ్రీరామరక్ష అని, ఇప్పటికైనా కాంగ్రెస్‌, బీజేపీ నా యకులు కళ్లు తెరిచి విమర్శలు మాని చేతనైతే సల హాలు ఇవ్వాలని హితవు పలికారు. జగిత్యాల జిల్లా కేంద్ర అభివృధ్దిలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తన విమర్శ లు మానుకుని అభివృధ్దికి సహకరించాలన్నా రు. జగిత్యాల బల్దియాలో మాస్టార్‌ ప్లాన్‌ లేక పట్టణం చిన్నాభిన్నం అయ్యిందని, నిత్యం విమర్శలు చేసే జీవన్‌రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ జీవన్‌రెడ్డి పదే పదే ప్రకటనలివ్వడం హాస్యాస్పద మన్నారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌ కుమార్‌, ధర్మపురి అర్వింద్‌లు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావా ల్సిన నిధులను తెప్పించాలని డిమాండ్‌ చేశారు. నా గార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టిన ప్రజల కు, విజయం సాధించిన నోముల భగత్‌కు అభినం దనలు తెలియజేశారు. సమావేశంలో రాయికల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, జగిత్యాల రూరల్‌ ఇంచార్జి ఎంపీపీ పాలేపు రాజేంద్ర ప్రసాద్‌, మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు ముజాహిద్‌ తదితరులు ఉన్నారు.

- జగిత్యాలో టీఆర్‌ఎస్‌ సంబరాలు

 నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ విజయం సాధిం చాడాన్ని హర్షిస్తూ ఆధివారం జగిత్యాల జిల్లా కేం ద్రంలోని తహసీల్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ పట్టణ యూత్‌ విభాగం అధ్యక్షుడు కత్తురోజు గిరి ఆధ్వ ర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం గిరి మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీలకు రాష్ట్రంలో ఇక స్థానం లేదనే రీతిలో టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు గాదె తిరుమల్‌, ప్రణయ్‌, పవన్‌, సుమన్‌, గంగాధర్‌, శ్రీను, కాంత్రి, రాము, వంశీ, ప్రశాంత్‌, మారుతీ, మోహన్‌, అజయ్‌, సాయిరాం, రాకేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-05-03T05:10:05+05:30 IST