పీఆర్టీయూ బలోపేతానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-08-10T06:13:56+05:30 IST

ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తున్న పీఆర్టీయూను మరింత బలోపేతం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి అన్నారు.

పీఆర్టీయూ బలోపేతానికి కృషి చేయాలి
రఘోత్తమరెడ్డిని సన్మానిస్తున్న ఆలయ సూపరింటెండెంట్‌ రాజశేఖర్‌

వేములవాడ, ఆగస్టు 9 : ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తున్న పీఆర్టీయూను మరింత బలోపేతం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి అన్నారు. సోమవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. సూపరింటెండెంట్‌ కే రాజశేఖర్‌  స్వామివారి కండువాతో సత్కరించి ప్రసాదం అందజేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాల ఆవరణలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘోత్తమరెడ్డి మాట్లాడుతూ  ఐదు దశాబ్దాలుగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ అంకితభావంతో పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తారన్నారు.  కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి నీలి శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకులు చిప్ప యాదగిరి, ఎల్‌.కిరణ్‌కుమార్‌, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు మాడిశెట్టి మహేశ్‌, నాయకులు హన్మాండ్లు, మధుకర్‌,రాజు, రమేశ్‌, మల్లారెడ్డి, శ్రీధర్‌ పాల్గొన్నారు.

 చందుర్తి: రానున్న రోజుల్లో 398 స్కేలు ఉన్న ఉపాధ్యాయులకు రెండు ఇంక్రిమెంట్లు సాధిస్తామని ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి అన్నారు. మండలంలోని జోగాపూర్‌  ప్రాథమిక పాఠశాలలో సోమవారం నిర్వహించిన హరితహారంలో మొక్కను నాటారు. అనంతరం మల్యాల గ్రామంలో బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడిన ఉపాధ్యాయుడు అల్లం లింగయ్యను పరామర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మ్యాకల పర్శరాములు, మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితులు, ఉపాధ్యాయ సంఘల నాయకులు గన్నమ నేని  శ్రీనివాసరావు, విక్కుర్తి లక్ష్మీనారాయణ, నీలి శ్రీనివాస్‌, ఎడ్ల కిషన్‌,శ్రీనివాసచారి, యోగేందర్‌, మల్లారెడ్డి, అంజనేయరావు, శంకర్‌, హన్మండ్లు, స్వరాజ్యలక్ష్మి, వనిత, భాగ్య లక్ష్మి, సుజాత, కవిత, ఎస్‌ఎంసీ చైర్మన్‌ తిరుపతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-10T06:13:56+05:30 IST