బాలికా సాధికారతకు చేయూత

ABN , First Publish Date - 2021-12-16T05:23:28+05:30 IST

బాలికా సాధికారకతకు ఎన్టీపీసీ చేయూతనందిస్తుందని, రామగుండం ఎన్టీపీసీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సునిల్‌ కువర్‌ అన్నారు.

బాలికా సాధికారతకు చేయూత
డిప్లొమా కోర్సుకు ఎంపికైన విద్యార్థినులతో సీజీఎం సునిల్‌కుమార్‌

- ఎన్టీపీసీ సీజీఎం సునిల్‌కుమార్‌
జ్యోతినగర్‌, డిసెంబరు 15: బాలికా సాధికారకతకు ఎన్టీపీసీ చేయూతనందిస్తుందని,  రామగుండం ఎన్టీపీసీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సునిల్‌ కువర్‌ అన్నారు. ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో  బుధవారం కుందనపల్లిలోని కస్తూర్బా బాలికల పాఠశాలకు చెందిన 10 మం ది విద్యార్థిను లను సెంట్రల్‌  ఇన్‌్టిట్యూట్‌ ప్లాస్టిక్‌  ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో (హైదరాబాద్‌) డిప్లొమా కోర్సులకు ఎంపిక చేశారు. ఈసందర్భంగా కేజీబీవీ విద్యార్థులతో సీజీఎం సమావేశమయ్యారు. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలలోని నిరుపేద విద్యార్థినులకు నైపుణ్య శిక్షణ, వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా కేజీబీవీకి చెందిన 10 మందిని సీఐపీఈటీ రెండేళ్ల డిప్లొమా కోర్సులకు ఎంపిక చేశామన్నారు. ఇది ప్రారంభం మాత్రమే అని భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలు, సదుపాయాలను కల్పిస్తామని సీజీఎం సునిల్‌కుమార్‌ తెలిపారు. ఏజీఎం హెచ్‌ఆర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ విద్య ద్వారానే బాలికా సాధికారికత సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో సీఎస్‌ఆర్‌ డీజీఎం డి.ఎస్‌.కుమార్‌, కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-16T05:23:28+05:30 IST