సీఎంకు పంటల సాగు తెలుసా

ABN , First Publish Date - 2021-11-09T05:49:16+05:30 IST

సీఎం కేసీఆర్‌కు పంటల సాగు గురించి తెలుసా అని కాంగ్రెస్‌ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మేడిపెల్లి సత్యం ప్రశ్నించారు.

సీఎంకు పంటల సాగు తెలుసా
మాట్లాడుతున్న సత్యం

మేడిపెల్లి సత్యం

కొడిమ్యాల, నవంబరు 8: సీఎం కేసీఆర్‌కు పంటల సాగు గురించి తెలుసా అని కాంగ్రెస్‌ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మేడిపెల్లి సత్యం ప్రశ్నించారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయ తీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరో పించారు. ఆదివారం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన  సమావేశంలో దళిత బం దు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, సంక్షేమ పథకాల గురించి మాట్లాడు తారని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు. వరి పంటకు ప్రత్యా మ్నాయంగా ఆరుతడి పంటలు వేస్తే లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఎందుకు కట్టారని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీకి దమ్ముం టే కేసీఆర్‌ అవినీతిపై సీబీసీఐడీతో విచారణ జరిపించేలా కేంద్రంపై ఒ త్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో టీపీసీ ఆర్గనై జింగ్‌ సెక్రటరీ గోగూరి మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షు డు చిలువేరి నారాయణగౌడ్‌, ఉప సర్పంచు జీవన్‌రెడ్డ్డి, కేంద్ర సహకార బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ మల్లిఖార్జున్‌రెడ్డ్డి, సింగిల్‌ విండో డైరెక్టర్‌ నాగభూ షణ్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు రాజేందర్‌,  ఉన్నారు. 

Updated Date - 2021-11-09T05:49:16+05:30 IST