ఇంటి పరిసరాల్లో చెత్త వేయవద్దు

ABN , First Publish Date - 2021-07-12T06:14:05+05:30 IST

ఇంటి పరిసరాల్లో చెత్త వేయద్దని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు.

ఇంటి పరిసరాల్లో చెత్త వేయవద్దు
రెండవ వార్డులో పర్యటిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

-ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

పెద్దపల్లిటౌన్‌, జూలై 11 : ఇంటి పరిసరాల్లో చెత్త వేయద్దని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు. ఆదివారం పట్టణంలోని రెండవ వార్డులో పర్యటించి న ఎమ్మెల్యే మాట్లాడారు. ఇండ్లలో తడి, పొడి చెత్త వేరుగా నిల్వచేసి మున్సిపల్‌ సిబ్బంది వచ్చినప్పుడు ఇవ్వాలన్నారు. సైడ్రైయిన్‌లలో చెత్త వేయడం వల్ల నీరు నిలిచి అనారోగ్యానికి గురవుతారని వివరించారు. వార్డులో చెత్తచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రామ్మోహన్‌రెడ్డికి సూచించారు. అలాగే వార్డుల్లో ఎలాంటి సమస్య లేకుండా పరిష్కరించాలన్నారు. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట స్థానికులు వార్డు కౌన్సిలర్‌ హన్మంతు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-07-12T06:14:05+05:30 IST