ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన డీఎంహెచ్‌ఓ

ABN , First Publish Date - 2021-05-13T05:36:29+05:30 IST

కొవిడ్‌ భారిన పడిన గర్భిణీల ప్రసవాలకు గోదావరిఖని ప్రభుత్వాసుపత్రి అనువుగా ఉంటుందో లేదోనని నిర్ధారించాలని కలెక్టర్‌ సంగీతసత్య నారాయణ ఆదేశాల మేరకు బుధవారం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రి డీఎంహెచ్‌ ఓ ప్రమోద్‌కుమార్‌, డీసీహెచ్‌ వాసుదేవరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కంది శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.

ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన డీఎంహెచ్‌ఓ
ఆసుపత్రిలో పరిశీలన జరుపుతున్న డీఎంహెచ్‌ఓ ప్రమోద్‌కుమార్‌

కళ్యాణ్‌నగర్‌, మే 12: కొవిడ్‌ భారిన పడిన గర్భిణీల ప్రసవాలకు గోదావరిఖని ప్రభుత్వాసుపత్రి అనువుగా ఉంటుందో లేదోనని నిర్ధారించాలని కలెక్టర్‌ సంగీతసత్య నారాయణ ఆదేశాల మేరకు బుధవారం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రి డీఎంహెచ్‌ ఓ ప్రమోద్‌కుమార్‌, డీసీహెచ్‌ వాసుదేవరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కంది శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. కొవిడ్‌ సోకిన గర్భిణులకు వైద్య సేవలు అం దించడానికి తలెత్తే ఇబ్బందులను, ఆపరేషన్‌ థియేటర్లను వారు పరిశీలించారు. అదే విధంగా ఆసుపత్రిలో 20పడకల ఆక్సిజన్‌ బెడ్లను త్వరగా ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఆక్సిజన్‌ సరఫరా చేసే విధంగా లైన్‌ త్వరగా ఏర్పాటు చేయాలని, కరోనా వార్డులో రోగులకు అన్నీ సౌకర్యాలు అందేవిధంగా చర్యలు చేపట్టాలని సూ చించారు. కాగా, ఆసుపత్రి పరిశీలన నివేదిక కలెక్టర్‌కు నివేదించనున్నట్టు డీఎం హెచ్‌ఓ ప్రమోద్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2021-05-13T05:36:29+05:30 IST