ఆనందోత్సాహాల మధ్య దీపావళి సంబరాలు
ABN , First Publish Date - 2021-11-06T05:22:48+05:30 IST
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో గురువారం దీపావళి వేడుకలు ఘ నంగా జరిగాయి.

కళ్యాణ్‌నగర్, నంబరు 5 : గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో గురువారం దీపావళి వేడుకలు ఘ నంగా జరిగాయి. పట్టణంలోని కార్మికవాడలన్నీ బా ణాసంచా, విద్యుత్‌దీపకాంతులతో వెలిగిపోయాయి. భక్తులు వేకువజామున ఈ ప్రాంతంలో పలు దేవాల యాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలా మంది గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. సాయంత్రం అన్ని వర్గాల ప్రజలు ఇంటి ఆవరణలో, తమ షాపుల్లో లక్ష్మీపూజలు, ప్రత్యేక నోములు నోచు కున్నారు. బొమ్మలకొలువు నిర్వహించారు. ఇంటి ఎదు ట దీపాలతో అలంకరించారు. ఇంటిల్లిపాది వివిధ రకాల బాణాసంచా కాల్చి దీపావళిని జరుపుకున్నారు. షాపుల్లో లక్ష్మీపూజ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశా రు. గోదావరిఖని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బాణాసంచా దుకాణాలతో పాటు గోదావరినది సమీపంలో, చంద్రశేఖర్‌నగర్‌లోని బాణాసంచా హోల్‌సేల్ షాపులు ఉదయం నుంచే కొనుగోళ్లతో కిక్కిరిసా యి. స్థానిక ప్రధాన చౌరస్తాలో దీటి బాలరాజు ఆధ్వర్యంలో బాణాసంచాకాల్చి దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుమ్మడి కు మారస్వామి, మొహిద్‌సన్ని, కారం వినయ్ పాల్గొన్నారు.