కరోనా బాధితులకు సరుకులు పంపిణీ
ABN , First Publish Date - 2021-05-05T06:10:30+05:30 IST
కరోనా బారిన పడ్డ వారు వైద్యుల సూచనల మే రకు చికిత్స పొందాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అమ్ముల లక్ష్మణ్ పేర్కొ న్నారు

మెట్‌పల్లి రూరల్, మే 4 : కరోనా బారిన పడ్డ వారు వైద్యుల సూచనల మే రకు చికిత్స పొందాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అమ్ముల లక్ష్మణ్ పేర్కొ న్నారు. మంగళవారం మండలంలోని రాజేశ్వరరావుపేట గ్రామంలో కరోనా బారి న పడ్డ కుటుంబాలకు అధైర్యపడవద్దని 25కిలోల సన్న బియ్యం, పప్పులను అం దజేశారు. తప్పనిసరైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు.
ఇబ్రహీంపట్నం : మండలంలోని రాజేశ్వర్‌రావుపేట గ్రామంలో కరోనా బారిన పడిన పేదలకు మాజీ సర్పంచ్ అమ్ముల లక్ష్మణ్ నెలకు సరిపడ నిత్యావసర స రుకులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారు ఎవరు అధైర్య పడ వద్దని అన్నారు. కరోనా బారిన పడిన కుటుంబలకు అన్ని విధాలుగా అదు కుంటానని తెలిపారు. ఈ కార్య క్ర మంలో సర్పంచ్ కాట శ్రీధర్, అజయ్ పాల్గొన్నారు.