ఓసీపీ-3ని సందర్శించిన డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం)

ABN , First Publish Date - 2021-02-27T04:48:28+05:30 IST

సింగరేణి డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) సత్యనారాయణరావు శుక్రవా రం ఓసీపీ-3 ప్రాజెక్టును సందర్శించారు.

ఓసీపీ-3ని సందర్శించిన డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం)
ప్రాజెక్టును పరిశీలిస్తున్న డైరెక్టర్‌ సత్యనారాయణరావు

యైుటింక్లయిన్‌కాలనీ, ఫిబ్రవరి 26: సింగరేణి డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) సత్యనారాయణరావు శుక్రవా రం ఓసీపీ-3 ప్రాజెక్టును సందర్శించారు. వ్యూపాయింట్‌ ద్వారా ప్రాజెక్టు పనులను పరశీలించిన ఆయన అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. హెచ్‌ఈఎంఎం యంత్రాల సామర్థ్యం, విని యోగం రోజుకు 14 గంటల నుంచి 18 గంటలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్పత్తిలో ప్రాజెక్టును ముందు వరుసలో నిలిపిన అధికారులు, కార్మికులకు డైరెక్టర్‌ అభినందనలు తెలియజేశారు. వెంట జీఎం(ఈఅండ్‌ఎం)గోపాలకృష్ణమూర్తి, ఆర్జీ-2 జీఎం వెంకటేశ్వరరావు, ఎస్వో టూ డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) జానకిరాం ఉన్నారు. అనంతరం డైరెక్టర్‌ ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-1 ప్రా జెక్టును సందర్శించి ఉత్పత్తి, ఉత్పాదకతలపై సమీక్షించారు. 

Updated Date - 2021-02-27T04:48:28+05:30 IST