పార్టీని బలోపేతం చేసేందుకే డిజిటల్ మెంబర్షిప్
ABN , First Publish Date - 2021-11-28T05:50:10+05:30 IST
పార్టీని బలోపేతం చేసేందుకు ఏఐసీసీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముం దుకు తీసుకువచ్చిందని మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొ న్నారు.

- కష్టపడితేనే అవకాశాలు దక్కుతాయి
- మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
పెద్దపల్లిటౌన్, నవంబరు 27: పార్టీని బలోపేతం చేసేందుకు ఏఐసీసీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముం దుకు తీసుకువచ్చిందని మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొ న్నారు. పార్టీ జిల్లా శాఖ అధ్య క్షుడు ఈర్ల కొమురయ్య ఆధ్వ ర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సమావేశానికి హాజరై శ్రీధర్ బాబు మాట్లాడారు. ప్రతి కార్య కర్త కష్టపడి సభ్యత్వ నమోదు అధిక సంఖ్యలో చేపట్టాలని సూచించారు. అప్పుడే పార్టీ అభివృద్ధి చెంది అందరూ ఎన్నికల్లో వివిధ స్థాయిలో గెలుపొందే అవకాశాలుంటాయన్నారు. గ్రామాలు, పట్టణాల్లో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ప్రజల్లో వివరించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేయాలన్నారు. ప్రతి బూత్ నుంచి 100 మందికి పైగా సభ్యత్వం నమోదు చేయాలన్నారు. డిసెంబర్ 9 వరకు పూర్తిచేసి అన్ని వివరాలను పార్టి అధిష్ఠానానికి పంపించాలన్నారు. 35 రోజు లుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి పడిగాపులు కాస్తున్న తరుణంలో అకాల వర్షంతో తడిసి ముద్దయ్యాయన్నారు. రబీ కొంటలేమని కేంద్రం ప్రకటిస్తే రాష్ట్రంలో అధికారంలో ఉండి ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీలోనే ప్రతి గింజ కొను గోలు చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు గాలికి వదిలేశా డని అన్నారు. కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించిన స్థానిక ప్రజాప్రతినిధులు ధాన్యం కొనుగోలు విషయంపై ప్రభుత్వం పై వత్తిడి తేవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వాలు పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు పెద్దపీట వేసి పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ఇచ్చామన్నారు. అంతకుముందు పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇన్చార్జీ నిరంజన్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో ఏలాంటి లోపాలు, సమస్యలు తలెత్తినా సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి కార్యకర్త కృషి చేస్తే రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగు ర వేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం వినోద్, దీపక్ జాన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అర్కాల వేణుగోపాల్‌రావు, సంజీవ్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ప్రేమ్ సాగర్‌రావు, బుషనవేన రమేష్‌గౌడ్, కల్వల శ్రీనివాస్, కొలిపాక సుజాత, గంట రాములు తదితరులు పాల్గొన్నారు.