బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా
ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST
బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు నిరసనగా బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

సిరిసిల్ల, మే 5 (ఆంధ్రజ్యోతి): బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు నిరసనగా బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు అన్నల్‌దాస్ వేణు మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రక్షణ కల్పించేందుకు వచ్చిన పోలీస్ వాహనాలపై కూడా దాడి చేశారన్నారు. ఎమ్మెల్యే సువింధుపై దాడి, మహిళా కార్యకర్తపై అత్యాచారాన్ని ఖండిస్తున్నామన్నారు. మమతా బెనర్జీ నుంచి బీజేపీ కార్యకర్తలకు రక్షణ కల్పించాలన్నారు. అనంతరం చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్‌యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కైలాస్, ఆదిపల్లి శ్రీనివాస్, మ్యాన రాంప్రసాద్, ఊరగొండ రాజు, దళిత మోర్చా అధ్యక్షుడు పెరుమాండ్ల ప్రవీణ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు మొగిలి రాజు, బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీగాధ మైసయ్య, చేనేత సెల్ కన్వీనర్ చుంచు ప్రకాష్, సాయికృష్ణ, రాహుల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట: మండలంలోని బస్టాండ్ ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమం చేపట్టనున్నారని తెలుసుకున్న పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అయినా పోలీసుల కళ్లుగప్పి దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదలను చూడని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడ్డారన్నారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శులు నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి, ఉపాధ్యక్షుడు పున్ని సంపత్, నాయకులు బొల్లారం ప్రసన్న, బండారి రాజు, తిప్పారపు శ్రావణ్, గజ్జల శ్రీనివాస్, మామిడి హరీష్, కృష్ణ, కిషన్, కరుణాకర్, అనీల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడం అమానుషమని బీజేపీ జిల్లా నాయకుడు బుగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. తృణముల్ కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రాకముందే ఆ పార్టీ నాయకులు గుండాలుగా వ్యవహరించారన్నారు. మహిళామోర్చా కార్యకర్తపై దారుణంగా అత్యాచారం చేసి హతమార్చారన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.