పౌలీ్ట్ర ఫాం నిర్మాణాన్ని నిలిపి వేయాలని ధర్నా
ABN , First Publish Date - 2021-02-01T06:00:53+05:30 IST
మండలంలోని మైలారం శివారులోని మల్లికార్జున స్వామి, సీతారామాంజనేయ ఆలయాల సమీపంలో నిర్మిస్తున్న పౌలీ్ట్ర ఫాం పనులను నిలిపి వేయాలని ఆదివారం గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.

గన్నేరువరం, జనవరి 31: మండలంలోని మైలారం శివారులోని మల్లికార్జున స్వామి, సీతారామాంజనేయ ఆలయాల సమీపంలో నిర్మిస్తున్న పౌలీ్ట్ర ఫాం పనులను నిలిపి వేయాలని ఆదివారం గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వరాల పర్శరాములు మాట్లాడుతూ ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టామని, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందించాలని ఆయన కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సీఐ శశిధర్‌తో ఫోన్‌లో మాట్లాడి నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయించారు. దీంతో గ్రామస్థులు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ నూకల తిరుపతి, జక్కనపల్లి సత్తయ్య, తోట కోటేశ్వర్, ఔషధ రాజయ్య, మర్రి వెంకటమల్లు, ప్రకాష్‌రెడ్డి, పర్శయ్య, కరుణాకర్‌రెడ్డి, పవన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.