పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని ధర్నా

ABN , First Publish Date - 2021-12-08T05:12:34+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎండీ సమీ పర్వేజ్‌ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని తెలంగాణ చౌక్‌లో నిరసన తెలిపారు.

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని ధర్నా
తెలంగాణచౌక్‌లో ధర్నా చేస్తున్న బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు

గణేశ్‌నగర్‌, డిసెంబరు7: పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎండీ సమీ పర్వేజ్‌ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని తెలంగాణ చౌక్‌లో నిరసన తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విఽధానాలతో ప్రజల సొమ్ము దోపిడీ చేసి రాజ్యమేలుతుందని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌ ధరలను తగ్గించి సామాన్యుడి కష్టాలు తీర్చడానికి చర్యలు చేపట్టిం దని అన్నారు. దేశంలోని చాలా రాష్ర్టాలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ను తగ్గించా యన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గిం చడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండీ జమాల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరిఫ్‌ ఖాన్‌, నాయకులు మీర్జా అసదుల్లా బేగ్‌, అజీమ్‌ సిద్దిఖి, ఎండీ అయూబ్‌, ఎండీ హైమద్‌, ఎండీ సాజిద్‌, ఎస్‌కే అంజాద్‌, షరీఫ్‌, లక్ష్మారెడ్డి, పొన్నం మొండయ్య గౌడ్‌, నాంపల్లి శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:12:34+05:30 IST