కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

ABN , First Publish Date - 2021-08-10T05:50:37+05:30 IST

కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
కలెక్టరేట్‌ ఎదుట దళిత సంఘాల ధర్నా

సుభాష్‌నగర్‌, ఆగస్టు 9: కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో  సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు జి ముకుందరెడ్డి, పొనగంటి కేదారి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మికులు సంఘటితంగా పోరాడే హక్కులను కాలరాసే కార్మిక కోడ్‌లను ప్రవేశెట్టిందన్నారు. ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశశారు. కార్యక్రమంలో వర్ణ వెంకట్‌ రెడ్డి, గుడికందుల సత్యం, ఎడ్ల రమేశ్‌, జిందం ప్రసాద్‌, కొయ్యడ సృజన్‌కుమార్‌, బండారి శేఖర్‌, బుచ్చన్న యాదవ్‌, బోయిని అశోక్‌, వడ్ల రాజు, రాయికంటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


దళిత సంఘాల ఆధ్వర్యంలో..

  హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ముందే 10 లక్షల రూపాయలను దళితుల అకౌంట్‌లో వేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఎమ్మార్పీఎస్‌, మాలమహానాడు, దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి ఇంజం వెంకటస్వామి, మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, నాయకులు చికుముల రాజయ్య, మాతంగి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-10T05:50:37+05:30 IST