ధర్మపురి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-03-24T06:11:34+05:30 IST
ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాల యంలో మార్చి 24 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల (జాతర) ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ గుగులోతు రవి తెలిపారు.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రవి
ధర్మపురి, మార్చి 23: ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాల యంలో మార్చి 24 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల (జాతర) ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ గుగులోతు రవి తెలిపారు. స్థానిక గోదావరి నది, బ్రహ్మపుష్కరిణి, దేవాలయాల వద్ద బ్రహ్మోత్సవాల కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను మంగళ వారం ఎస్పీ సింధూశర్మతో కలిసి ఆయన పరిశీలించారు. భక్తుల కోసం కల్పించిన వసతుల గురించి అధికారుల ద్వారా తెలుసుకున్నారు. అన్ని వీధుల్లో మున్సిపా లిటీ పక్షాన పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలు, మంచినీటి వసతి ఏర్పాట్లు సక్రమంగా చేపట్టాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 108 అంబులెన్స్ అం దుబాటులో ఉంచాలని సూచించారు. ధర్మపురి, రాయపట్నం గోదావరి నది వద్ద గజఈత గాళ్లను ఉంచాలని అన్నారు. ఎస్పీ సింధూశర్మ మాట్లాడుతూ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలయాల క్యూలైన్లు, గోదావరి నది స్నానఘట్టాల వద్ద ప్రత్యేక పోలీస్ సిబ్బందిని ఏర్పా టు చేస్తామని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, డీఎస్పీ వెంకట రమణ, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్, డీఎంహెచ్‌వో డాక్టర్ పుప్పాల శ్రీధర్, ఆర్టీసీ డీవీఎం నాగేశ్వర్‌రావు, మున్సిపల్ కమిషనర్ సంపత్‌రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ధర్మపురి క్షేత్రంలో ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. మార్చి 24న బుధవారం ఏకాదశి రోజున యజ్ఞా చార్యుల ఆహ్వానం, కళశ, విశ్వక్‌సేన, వాసుదేవ, పుణ్యహవచనం, బ్రహ్మ కలశ స్థాపన, అంకురార్పణ, వరహాతీర్థం, పుట్ట బంగారం తెచ్చుట ఉంటుందన్నారు.