ధనలక్ష్మి పూజలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-03T05:28:09+05:30 IST

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాల యంలో గల అద్దాల మండపంలో మంగళవారం సాయంత్రం ధనలక్ష్మి పూజలు వైభవంగా ప్రారంభించారు.

ధనలక్ష్మి పూజలు ప్రారంభం
అద్దాల మండపం వద్ద పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

ధర్మపురి, నవంబరు 2: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాల యంలో గల అద్దాల మండపంలో మంగళవారం సాయంత్రం ధనలక్ష్మి పూజలు వైభవంగా ప్రారంభించారు. దీపావళి పర్వదినం పురస్కరించు కుని ఆలయ సామవేద పండితులు ముత్యాలశర్మ,  నేరెళ్ల శ్రీనివాసాచా ర్యులు, ముఖ్య అర్చకులు లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాలను పురస్కరించుకుని ఆలయా ల్లో మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఆలయ సూపరింటెం డెంట్‌ ద్యావళ్ల కిరణ్‌కుమార్‌, అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, అభిషేక్‌ పౌరోహితులు సంతోష్‌కుమార్‌, సంపత్‌కుమార్‌, చక్రపాణికుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-03T05:28:09+05:30 IST