సింగరేణి యాజమాన్యంతో డీజీఎంఎస్‌ కుమ్మక్కు

ABN , First Publish Date - 2021-11-23T06:17:07+05:30 IST

మైనింగ్‌ సెక్టార్‌లో రక్షణ వ్యవ స్థలను పర్యవేక్షించాల్సిన డీజీఎంఎస్‌ అధికారులు సింగరేణి యాజమా న్యంతో కమ్ముకైనట్టు సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ఆరోపించారు.

సింగరేణి యాజమాన్యంతో డీజీఎంఎస్‌ కుమ్మక్కు
మాట్లాడుతున్న యాదగిరి సత్తయ్య

- బీఎంఎస్‌

యైటింక్లయిన్‌కాలనీ, నవంబరు 22: మైనింగ్‌ సెక్టార్‌లో రక్షణ వ్యవ స్థలను పర్యవేక్షించాల్సిన డీజీఎంఎస్‌ అధికారులు సింగరేణి యాజమా న్యంతో కమ్ముకైనట్టు సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ఆరోపించారు. సోమవారం ఓసీపీ-3 కృషిభవన్‌లో జరిగిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మణుగూరు ప్రమాదానికి రకీబ్‌ అనే ఆపరేటర్‌ని డిస్మిస్‌ చేయడాన్ని బీఎంఎస్‌ ఖండిస్తున్నట్టు తెలిపారు. ఐదేళ్ళలో సంస్థలో అనేక ప్రమాదాలు జరిగాయని, సుమారు 60మంది కార్మికులు మరణించినట్టు తెలిపారు. వీటన్నింటికి యాజ మాన్య నిర్లక్షమే కారణమని విచారణలో తేలినా కేవలం కార్మికులను ప్రమాదాలకు బాధ్యులు చేస్తూ క్రమశి క్షణా చర్యలు తీసుకునే సంస్కృ తి సింగరేణిలో ఉన్నదన్నారు. సింగరేణిలో రక్షణ వ్యవస్థపై డీజీఎం ఎస్‌ పర్యవేక్షణ నామమాత్రమని, ప్రమాదాలు జరిగినపుడు కార్మికు లపై నెపం నెట్టుతూ డీజీఎంఎస్‌ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. డీజీఎంఎస్‌ అధికారులపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శికి బీఎంఎస్‌ తరఫున ఫిర్యాదు చేశామన్నారు. ఇటీవల ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాకలు కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సత్తయ్య డిమాండ్‌ చేశారు. కోల్‌ ఇండియాలో తీసే బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి 10శాతం మాత్రమే తీస్తుందని, ప్రమా దాల్లో మాత్రం కోల్‌ఇండియా కంటె ఎక్కువ స్థాయిలో జరుగుతున్నట్టు సత్తయ్య అన్నారు. ఇప్పటికైనా రక్షణ చర్యలు పటిష్టంగా అమలు జరిగేలా డీజీఎంఎస్‌ దృష్టి సారించాలని సత్తయ్య డిమాండ్‌ చేశారు. ఈగేట్‌మీటింగ్‌లో పెండెం సత్యనా రాయణ, వడ్డేపల్లి కుమార్‌, చిర్ర ఆంజనేయులు, సత్తయ్య, అనుపరమేష్‌, భూమ య్య, రాయలింగులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-23T06:17:07+05:30 IST