మల్లన్న బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులు

ABN , First Publish Date - 2021-07-12T06:05:06+05:30 IST

ఓదెలలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది.

మల్లన్న బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులు
ఆలయంలో సుంకు బియ్యం పూజలు నిర్వహిస్తున్న ఈఓ రాజేంద్రం

- భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం

ఓదెల, జూలై11: ఓదెలలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. పెద్దపల్లి, కరీంనగర్‌, జనగామ, వరంగల్‌, సిద్దిపేట, మంచిర్యాల, సికింద్రాబాద్‌ ప్రాంతాల నుంచి స్వామివారి పెద్దపట్నం బ్ర హ్మోత్సవాలకు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కరోనా సమయంలో లెక్క చేయకుండా భక్తులు మల్లికార్జున స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో రెండు గంటల పాటు వేచి ఉండి దర్శనం చేసు కున్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి తర లివచ్చిన కుటుంబాలు స్వామివారికి ఒగ్గు పూ జారులతో పట్నాలు బోనాలు, కోడె మొక్కులను సమర్పించారు. అలాగే ఈఓ రాజేంద్రం సిబ్బం ది భ్రమరాంబ మల్లికార్జున స్వామి వద్ద సుం కు బియ్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతిపూజ, పుణ్యాహవచనం, మం డపస్థాపన, భద్రకాళి అవాహనం అర్చకులు నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి స్వామి వారికి ఒగ్గు పూజారులు పెద్దపట్నం సమర్పించారు. అలాగే సోమవారం తెల్లవారుజామున అగ్ని గుండం నుంచి భక్తులు దాటే ప్రక్రియ ప్రారం భం కానుందని ఆలయ సిబ్బంది తెలిపారు.

Updated Date - 2021-07-12T06:05:06+05:30 IST