సమష్టి సహకారంతోనే జిల్లా అభివృద్ధి

ABN , First Publish Date - 2021-01-13T05:23:20+05:30 IST

సమిష్టి సహకారంతోనే జిల్లా అభివృద్ది సాధ్యం అవుతుందని జగిత్యాల జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ దావ వసంత అన్నారు.

సమష్టి సహకారంతోనే జిల్లా అభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌

జిల్లా పరిషత్‌ సమావేశంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత 

జగిత్యాల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): సమిష్టి సహకారంతోనే జిల్లా అభివృద్ది సాధ్యం అవుతుందని జగిత్యాల జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ దావ వసంత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక పద్మనాయక మినీ ఫంక్షన్‌ హాల్‌లో జి ల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కాగా 29 అంశాలతో ఎజెం డాగా రూపొందించగా కేవలం కొన్ని అంశాలను మాత్రమే సమావేశంలో చర్చిం చారు. పలు మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు సమావేశంలో భాగంగా పలువురు ప్రజాప్రతినిధులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీ సుకువచ్చారు. ప్రధానంగా ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో బీర్‌పూర్‌ మండలం లో రెన్యూవల్‌ బీట్‌ చేయాలని, ఘూట్‌ రోడ్డు కూడా పునరుద్దరించాలని కోరగా, బుగ్గారం జడ్పీటీసీ బాదినేని రాజేంధర్‌ బుగ్గారంలో ఆర్‌అండ్‌బీ అధికారుల పర్య వేక్షణ తీరు సరిగా లేదని విమర్శించారు. మిషన్‌ భగీరథ వల్ల రోడ్లన్నీ చెడిపో తున్నాయని, బౌండ్రీ ఫిక్స్‌అప్‌ చేసి పనులు చేయాలని సమావేశం దృష్టికి తీసు కువచ్చారు. అలాగే ఆర్టీసీ డివిజనల్‌ మేనేజర్‌ నాగేశ్వర్‌రావు సంస్థ పురోగాభివృ ద్ధిని వివరించగా రాయికల్‌ ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, బీర్‌పూర్‌ ఎంపీపీ మ సర్థి రమేష్‌ పలు సమస్యలను లేవనెత్తారు. ప్రధానంగా బీర్‌పూర్‌, బాల్కొండ ప్రాంతాల్లో ఇసుక రీచ్‌ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. స్సందించిన కలెక్టర్‌ జిల్లాలో 6 ఇసుక రీచ్‌లు గుర్తించామని, త్వరలోనే వాటిని ప్రజలకు అందుబాటులోకి తె చ్చేలా చూడాలన్నారు. అలాగే జడ్పీకి వచ్చే సీనరేజ్‌ నిధుల విడుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పల్లె పకృతి వనా ల బిల్లులు రావడం లేదని, పల్లె ప్రగతి బిల్లులు సైతం ఎంబీ రీకార్డు కాలేకపో వడంతో ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని సమావేశం దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన కలెక్టర్‌  పల్లె ప్రగతి పనుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రోళ్లవాగు ప్రాజెక్ట్‌ నిర్మాణ విషయంలో జాప్యంపై ఫారెస్ట్‌ అధికారులు, ఇరిగేషన్‌ అధికారుల తీరు పై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌. అలాగే డీ-52 కెనాల్‌ తూము ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు. రోళ్లవాగు ప్రాజెక్ట్‌ విష యంలో జరిగిన చర్చలో భాగంగా ప్రైవేట్‌ పనుల విషయంలో ఎలాంటి అభ్యం తరాలు చెప్పని ఫారెస్ట్‌ అధికారులు, ప్రభుత్వం చేపడుతున్న పనులకు అడ్డుత గలడం దారుణం అని డీసీఎంఎస్‌ ఛైర్మెన్‌ శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్‌ ఆలోచన విఽధానాన్ని అమలు చేయడంలో అధికా రులు విఫలం అయ్యారంటూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అధికారుల తీరుపై విమర్శల వర్షం గుప్పించారు. ఇప్పటికైనా మిషన్‌ భగీరథ అధికారులు పునరా లోచించుకుని పథకం పనితీరును మెరుగుపర్చేలా చర్యలు చేపట్టాలని సూచిం చారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ రవి, జడ్పీ సీఈవో శ్రీనివాసులు, డిప్యూటీ సీఈ వో శ్రీలత, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, విద్యాసాగర్‌రావు, రవిశంకర్‌, వై స్‌ చైర్మన్‌ హరిచరణ్‌రావుతో పాటు పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా లోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:23:20+05:30 IST