కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశానికి జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2021-12-31T05:45:51+05:30 IST

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశానికి జర్నలిస్టులకు అనుమతి నిరాకరించారు.

కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశానికి జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ
కౌన్సిల్‌ హాల్‌ ఎదుట బైఠాయించిన జర్నలిస్టులు

- నిరసన వ్యక్తం చేసిన పాత్రికేయులు

కోల్‌సిటీ, డిసెంబరు 30: రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశానికి జర్నలిస్టులకు అనుమతి నిరాకరించారు. గురువారం జరిగిన సమావేశానికి అరగంట ముందు ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి జర్నలిస్టులకు కౌన్సిల్‌ సమావేశానికి అనుమతి లేదంటూ మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌ ప్రకటించారు. జర్నలిస్టులను కౌన్సిల్‌ సమావేశ మందిరానికి అనుమతించవద్దంటూ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. కౌన్సిల్‌ సమావేశ మందిరం వద్ద భారీ పోలీస్‌బందోస్తును ఏర్పాటుచేయించారు. కాగా కౌన్సిల్‌ సమా వేశానికి అనుమతి నిరాకరించడంపై జర్నలిస్టులు నిరసన తెలిపా రు. సమావేశ మందిరం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. జర్నలిస్టుల ఆందోళనకు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు బొంతల రాజేష్‌, మహంకాళి స్వామి కొలిపాక సుజాత, ముస్తాఫా, పెద్దెల్లి తేజస్వినిప్రకాష్‌, నగునూరి సుమలతరాజు, ముదాం శ్రీనివాస్‌ మద్దతు తెలి పారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ రెం డుమూడేళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన జీవోను సాకుగా చూపి ఆంక్ష లు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఈ నిరంకుశ చర్యలను తీ వ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-12-31T05:45:51+05:30 IST