కొనుగోలు కేంద్రాల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-01-12T06:07:22+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల రద్దు నిర్ణ యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కాం గ్రెస్‌ జిల్లా కమిటీ ఆఽధ్వర్యంలో కలెక్టరేట్‌ ఏవో గంగయ్యకు వినతిపత్రం అందజేశారు.

కొనుగోలు కేంద్రాల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఏవో గంగయ్యకు వినతిపత్రం అందిస్తున్న నాయకులు

సిరిసిల్ల కలెక్టరేట్‌, జనవరి 11:ధాన్యం కొనుగోలు కేంద్రాల రద్దు నిర్ణ యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కాం గ్రెస్‌ జిల్లా కమిటీ ఆఽధ్వర్యంలో కలెక్టరేట్‌ ఏవో గంగయ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయన్నారు.  వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవరాజు,  ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌, రమణరెడ్డి, శ్రీకాంత్‌గౌడ్‌, నర్సయ్య, సర్వయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-12T06:07:22+05:30 IST