హుజురాబాద్‌లో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక సర్వే

ABN , First Publish Date - 2021-08-27T16:39:09+05:30 IST

హుజురాబాద్‌లో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక సర్వే జరగనుంది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు...

హుజురాబాద్‌లో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక సర్వే

కరీంనగర్ జిల్లా: హుజురాబాద్‌లో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక సర్వే జరగనుంది. ఈ మేరకు ప్రత్యేక బృందాలుగా అధికారులు బయలుదేరారు. శుక్రవారం నుంచి దళితుల వివరాలు సేకరించనున్నారు. వారి కుటుంబ స్థితిగతులపై ఆరా చేయనున్నారు. ఎవరికి ఏ యూనిట్లు అవసరమో వాటినే ఆ కుటుంబానికి ఇచ్చేలా అధికారులు సర్వే చేయనున్నారు. కాగా ఇవాళ కరీంనగర్‌లో దళిత బంధుపై సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు.


దళితబంధు పథకానికి పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న 20,929 దళిత కుటుంబాలన్నింటికి ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ రెండు వేల కోట్ల రూపాయలను కలెక్టర్‌ ఖాతాలో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున దళితబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated Date - 2021-08-27T16:39:09+05:30 IST