కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలి

ABN , First Publish Date - 2021-05-22T04:38:56+05:30 IST

కరోనా మహమ్మారి ప్రబలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలి
మందులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

ప్రైవేటు ఆసుపత్రుల్లో అయిన ఖర్చులను ప్రభుత్వమే చెల్లించాలి

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, మే 21 : కరోనా మహమ్మారి ప్రబలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని ఖిలా గడ్డ, గాంధీనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పురాతన పాఠశాలో నిర్వమిస్తున్న కరోనా నిర్థారణ పరీక్షల కేంద్రాన్ని జీవన్‌ రెడ్డి పరిశీలించారు. పరీక్షలకు వచ్చే అనుమానితులతో వసతులపై అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్‌ వచ్చిన రోగులతో మాట్లాడి వారిలో మనోధైరాన్ని నింపి కాంగ్రేస్‌ ఆధ్వర్యంలో సమకూర్చిన మందులను పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులు పేద ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయని, బిల్లులతో పీడిస్తున్నాయని దీంతో చికిత్స పొందిన రోగులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న రోగుల ఖర్చులను ప్రభుత్వమే భరించి వారికి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనాను ప్రభుత్వ పరంగా ఉచిత వైద్యం అందిస్తుంటే తెలంగాణలో మాత్రం అమలుకాకపోవడం  దురదృష్టకరమన్నారు. ఆంధ్రప్రధేశ్‌ రాష్ట్రంలో కరోనా, బ్లాక్‌ ఫంగస్‌లను ఆరోగ్యశ్రీలో చేర్చిందని తెలంగాణ రాష్ట్రంలో కూడా చేర్చి రోగులకు అండగా నిలువాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అమలుపరుచడం సంతోషదగ్గ విషయమన్నారు. కానీ తెలంగాణలో దారిద్యరేఖకు దిగువన ఉన్న కోటి మందిలో కేవలం 26 లక్షల ప్రజలు మాత్రమే ఆయుష్మాన్‌ భారత్‌కి అర్హులవుతురాని వివరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌ నాయకులు గాజుల రాజేందర్‌, కమటాల శ్రీనివాస్‌, కల్లెపెల్లి దుర్గయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-05-22T04:38:56+05:30 IST