భోగిమంటల్లో నూతన వ్యవసాయ చట్టాల కాపీలు

ABN , First Publish Date - 2021-01-14T05:07:29+05:30 IST

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లి అంబేద్కర్‌ చౌరస్తాలో నూతన వ్యవసాయ చట్టాల కాపీలను బుధవారం భోగిమంటల్లో వేసి దహనం చేశారు.

భోగిమంటల్లో నూతన వ్యవసాయ చట్టాల కాపీలు
నూతన వ్యవసాయ చట్టాలను దహనం చేస్తున్న నాయకులు

కరీంనగర్‌ రూరల్‌, జనవరి 13: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లి అంబేద్కర్‌ చౌరస్తాలో నూతన వ్యవసాయ చట్టాల కాపీలను బుధవారం భోగిమంటల్లో వేసి దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను, విద్యుత్‌ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం, సహాయ కార్యదర్శి కవ్వంపల్లి అజయ్‌, నాయకులు రాచకొండ దేవేందర్‌, సుందరగిరి బాబు, ఆరెల్లి చంద్రయ్య, జేరిపోతుల అంజయ్య, సంపత్‌, ఈశ్వర్‌, అంజయ్య, సిద్ధూ, వినయ్‌, విన్ను, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T05:07:29+05:30 IST