డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2021-10-29T06:07:09+05:30 IST
రాయికల్ పట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు లబ్ధిదారు లకు ఇప్పటివరకు ఇవ్వలేదని బీజేపీ నాయ కులు గురువారం తహసీ ల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు

రాయికల్, అక్టోబరు 28: రాయికల్ పట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు లబ్ధిదారు లకు ఇప్పటివరకు ఇవ్వలేదని బీజేపీ నాయ కులు గురువారం తహసీ ల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. రెండు సంవత్సరాలుగా లబ్ధిదారు లు ఎదురు చూస్తున్నారని కాంట్రాక్టర్ అలసత్వంతో నిర్మాణాలు పూర్తి కావడంలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణం నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కల్లెడ ధర్మపురి, నాయకులు కుర్మ మల్లారెడ్డి, నారాయణరెడ్డి, భూమేష్, రామకృష్ణ, శ్రీకాంత్, ప్రవీణ్, శశి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.