నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
ABN , First Publish Date - 2021-11-06T05:02:19+05:30 IST
నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యం అని వే ములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు.

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు
మేడిపల్లి, నవంబరు 5: నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యం అని వే ములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. వల్లంపల్లి గ్రా మంలో కోటి 40 లక్షల వ్యయంతో నిర్మించిన 33/11 కేవి సబ్ స్టేషన్‌ను, పల్లెప్రకృతి వనాన్ని, గ్రామంలోని నూతనంగా ఏర్పాటు చేసిన డా, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జడ్పీ చైర్‌పర్సన్‌తో కలి సి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వరద కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి రూ 3.25 కోట్లతో ప్రాతిపాదన పంపామన్నారు. పాఠశాలల్లో మౌలిక వ సతుల ఏర్పాటుకు రానున్న కాలంలో రూ 3 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు. రైతులు ఖరీఫ్‌లో పండించిన ధాన్యం ప్రతి గింజను ప్రభు త్వం కొనుగోలు చేస్తుందని రైతులు అందోళన చెందవద్దని అన్నారు. రై తులు గ్రామంలో యూనిట్‌గా ఏర్పడి ప్రత్యామ్నాయ పంటలపై ధృష్టి పెట్టాలని రైతులు లాభ దాయకమైన పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. డాక్టర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావి అని ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే నేడు అర్టికర్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పడిందన్నారు. అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వసంత, వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, ఎంపీపీ ఉ మాదేవి, సర్పంచ్ సమత- నవీన్‌రెడ్డి, యంపీటీసీ, పీఏసీఎన్ చైర్మన్ ర వింధర్‌రావు, ఏఈ దివాకర్‌రావు, అంబేడ్కర్ సంఘాల నేతలు రాజేష్, గోపి, లక్ష్మణ్, వెంకటేష్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ, టీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.