కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు

ABN , First Publish Date - 2021-12-10T06:20:30+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ పునర్‌వైభవం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు
సిరిసిల్లలో డిజిటల్‌ సభ్యత్వం నమోదు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

సిరిసిల్ల టౌన్‌, డిసెంబర్‌ 9: కాంగ్రెస్‌ పార్టీ పునర్‌వైభవం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లాలోని పలు చోట్ల పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమో దు చేపట్టారు. సిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం లో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిజిటల్‌ సభ్యత్వ నమోదును జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు.  సిరిసిల్ల పట్టణంలో దాదాపు 15 వేల సభ్యత్వ నమోదులు చేస్తామన్నారు. కార్యకర్తలు సభ్యత్వ నమోదుకు సహకరించాలన్నారు. దేశంలో మొట్టమొదటి సారిగా డిజిటల్‌ సభ్యత్వ నమోదు చేస్తున్నది కాంగ్రెస్‌ పార్టీ   అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, పట్టణ కాం గ్రెస్‌ మహిళ విభాగం అధ్యక్షురాలు కాముని వనిత, నాయకులు శ్రీరాముల వెంకటేశం, వంగ మల్లేశం, తాటికొండ శ్రీనివాస్‌, చిందమ్‌ శ్రీనివాస్‌, నూనె శ్రీనివాస్‌, అకినే సతీష్‌, అంకం దేవాదాస్‌, రాజమల్లు, ముదిగొండ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-10T06:20:30+05:30 IST