జీడీకే ఓసీపీ5 పబ్లిక్ హియరింగ్‌ను నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-07-08T05:36:39+05:30 IST
గోదావరిఖని మనుగడ ఉండాలంటే జీడీకే ఓసీపీ-5 పబ్లిక్ హియరింగ్‌ను నిర్వహించాలని టీబీజీకేఎస్ ఆర్‌జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు కోరారు.

- టీబీజీకేఎస్ ఆర్‌జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్
గోదావరిఖని, జూలై 7: గోదావరిఖని మనుగడ ఉండాలంటే జీడీకే ఓసీపీ-5 పబ్లిక్ హియరింగ్‌ను నిర్వహించాలని టీబీజీకేఎస్ ఆర్‌జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు కోరారు. బుధవారం గోదావరిఖని టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌లో నిర్వహించాల్సిన పబ్లిక్ హియరింగ్‌ను కొన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు అడ్డుకున్నారని, ఓసీపీ-5ని అడ్డుకుంటే గోదావరిఖనితో పాటు సింగరేణి ఆర్‌జీ-1నే మ నుగడ లేకుండాపోతుందన్నారు. ఇప్పటికే మేడిపల్లి ఓసీపీలో బొగ్గు నిల్వలు అ యిపోయాయని, అందులో పని చేస్తున్న కార్మికులను వేరే చోటుకు బదిలీ చేస్తున్నారని, జీడీకే ఓసీపీ ప్రారంభమైతే ఇక్కడనే కార్మికులను నియమించుకోవచ్చునన్నారు. టీబీజీకేఎస్‌పై కొంత మంది బురద జల్లుతున్నారని, కార్మికులకు వ్యతిరేకంగా పని చేసే వారు టీబీజీకేఎస్‌ను ఓర్వడం లేదన్నారు. ఇప్పటికైనా జీడీకే ఓసీపీ5 ప్రారంభానికి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు పుట్ట రమేష్, కృష్ణమూర్తి, గంగాధర్, కుశనపల్లి శంకర్, మల్లయ్య, ఐలయ్య, ఎడవెల్లి రాజిరెడ్డి, నాయిని శంకర్, దాసరి నర్సయ్య, చిందం శ్రీనివాస్, పాపారావు, కృష్ణ, శ్రావణ్ పాల్గొన్నారు.