కొనుగోలు కేంద్రంలో రైతుల ఆందోళన
ABN , First Publish Date - 2021-05-05T06:31:41+05:30 IST
ఎల్లారెడ్డిపేట పంచాయతీ పరిధిలోని కిషన్‌దాస్‌పేట సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు తీరుపై రైతులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చే శారు. ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారని ఆందోళనకు దిగారు.

ఎల్లారెడ్డిపేట, మే 4: ఎల్లారెడ్డిపేట పంచాయతీ పరిధిలోని కిషన్‌దాస్‌పేట సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు తీరుపై రైతులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చే శారు. ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారని ఆందోళనకు దిగారు. తాలు, పొల్లు, మట్టి పేరిట జాలీ పట్టాలని ఇబ్బందులకు గురి చే స్తున్నారని మండిపడ్డారు. నిర్వాహకుడు రవికి సంబంధించిన బంధువులు, డబ్బులు ఇచ్చే రైతు ల ధాన్యాన్ని శుద్ధి చేయకుండానే కాంటా పెడు తున్నారని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తమపై దురుసుగా ప్రవరిస్తున్నారని వాపోయా రు. నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లు చేపడుతున్న నిర్వాహకుడు రవిని తొలగించాలని డిమా ండ్ చేశారు. అధికారులు స్పందించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు.