దళితుల భూములు తీసుకుంటే ఆందోళన

ABN , First Publish Date - 2021-08-03T05:45:32+05:30 IST

దళితులకు సంబంధించిన భూములు అధికా రులు తీసుకుంటే పార్టీ తరఫున రైతులకు అండగా ఉండి ఆందోళన చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం అన్నారు.

దళితుల భూములు తీసుకుంటే ఆందోళన
విలేకరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు

- కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం 

ముత్తారం,ఆగస్టు 2 : దళితులకు సంబంధించిన భూములు అధికా రులు తీసుకుంటే పార్టీ తరఫున రైతులకు అండగా ఉండి ఆందోళన చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం అన్నారు. మండలంలోని ఖమ్మంపల్లి గ్రామశివారులోని దళితులకు సం బంధించిన 615సర్వేనెంబర్‌ భూమిని సోమవారం పరిశీలించారు. అనం తరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన 30సంవత్సరాలుగా దళిత,బీసీ కుటుంబాలు భూమిని సాగుచే సుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. అటువంటి భూమిని అధి కారులు లాక్కొని మెగాపార్కు ఏర్పాటుచేయాలని ప్రయత్నించడం స రైందికాదన్నారు. రైతులు కోర్డుకు వెళ్లారని, అధికారులు కోర్టు ఉత్తర్వుల ను లెక్కచేయకుడా భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇట్టిభూమిని అధికారులు అన్యాయంగా తీసుకుంటే కాంగ్రెస్‌ పార్టీ రైతు ల పక్షాన ఆందోళన చేపడుతామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షు డు దొడ్డ బాలాజీ, నాయకులు బియ్యని శివకుమార్‌, వాజీద్‌పాషా, మ ద్దెల రాజయ్య, గోపి, అల్లం కుమార్‌, చంద్రమౌళి, తోడేటీ శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T05:45:32+05:30 IST