‘సింగిల్‌విండోలో అవినీతిపై ఫిర్యాదు చేస్తాం’

ABN , First Publish Date - 2021-10-29T05:55:40+05:30 IST

స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లావాదేవీ ల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర కో-అర్డినేటర్‌ శశిభూషణ్‌కాచే పేర్కొన్నా రు.

‘సింగిల్‌విండోలో అవినీతిపై ఫిర్యాదు చేస్తాం’
విలేకరులతో మాట్లాడుతున్న శశిభూషణ్‌కాచే

మంథని, అక్టోబర్‌ 28: స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లావాదేవీ ల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర కో-అర్డినేటర్‌ శశిభూషణ్‌కాచే పేర్కొన్నా రు. గురువారం కాచే విలేకరులతో మాట్లాడుతూ.. సంఘానికి, రైతులకు సంబం ధించిన ఆదాయ వనరులను చైర్మన్‌, సీఈవో ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారన్నారు. గతంలో అక్రమాల అరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని సీఈవోగా మళ్లీ నియమించార న్నారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో చూపిన లేక్కల్లో చాలా వరకు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. సుత్లీ కొనుగోలు, ఫ్లెక్సీలు, సెల్‌ఫోన్‌ బిల్లు, ఇలా అనే క అంశాల్లో అడ్డగోలుగా ఖర్చు చేశారన్నారు. నిబంధనల ప్రకారం ఇంకా ప్రభుత్వప రంగా క్లియరెన్స్‌ రాని మల్లెపల్లిలోని సంఘం కొనుగోలు చేసిన భూమిలో రైస్‌మిల్లు నిర్మాణం కోసం ఏర్పాట్లు చేయడం, ఈ స్థలం పక్కనే ఉన్న ప్రైవేట్‌ వ్యక్తి రైస్‌ మిల్లు వ్యక్తికి లాభం చేకూర్చే విధంగా విద్యుత్‌ కనెక్షన్‌ కోసం సంఘం తరుపున రూ.16 లక్షలు కట్టారన్నారు. సంఘంలో జరిగిన అవినీతి, అక్రమాలపై అన్ని దర్యాప్తు సంస్థ లకు ఫిర్యాదు చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ మీటింగ్‌లో తమ నాయకుడిపై జడ్పీ చైర్మ న్‌ పుట్ట మధు చేసిన అరోపణలను ఖండిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు సెగ్గెం రాజేష్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు గోటికార్‌ కిషన్‌జీ, అజీం, చొప్పకట్ల హన్ముంతు, అయిలి ప్రసాద్‌లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-29T05:55:40+05:30 IST