సెల్ టవర్ నిర్మాణం ఆపాలని కాలనీవాసుల ధర్నా
ABN , First Publish Date - 2021-10-26T05:15:49+05:30 IST
పట్టణంలోని 9వ వార్డులో రామ్‌నగర్, సు ల్తాన పూర మధ్యలో ఒక వ్యక్తి ఇంటిపై చేస్తున్న సెల్ టవర్ నిర్మాణం ఆపివేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు కొత్త బస్టాండ్ సమీపం లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

మెట్‌పల్లి, అక్టోబరు 25: పట్టణంలోని 9వ వార్డులో రామ్‌నగర్, సు ల్తాన పూర మధ్యలో ఒక వ్యక్తి ఇంటిపై చేస్తున్న సెల్ టవర్ నిర్మాణం ఆపివేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు కొత్త బస్టాండ్ సమీపం లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కాలనీ వాసులు మాట్లాడుతూ కాల నీలో సెల్ టవర్ నిర్మాణం చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొం టారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు ఉన్న నేపఽఽథ్యంలో ప్రమా దకర రేడియేషన్ బారిన పడి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలి పారు. వెంటనే సెల్ టవర్ నిర్మాణం ఆపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు వినతి పత్రం అందజేశారు.