ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
ABN , First Publish Date - 2021-05-05T06:00:08+05:30 IST
మండలంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం కలెక్టర్ డాక్టర్ సంగీత పరిశీలించారు.

ధర్మారం, మే 4: మండలంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం కలెక్టర్ డాక్టర్ సంగీత పరిశీలించారు. మండలంలోని ఖిలావనపర్తి, బుచ్చయ్యపల్లి, నర్సింహులపల్లి, దొంగతుర్తి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రా లను ఆమె పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. ఆయా గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలుపై తహసీల్దార్ సంపత్ కలెక్టర్‌కు వివరించారు, వరిధాన్యంను వెనువెంటన్నే కొనుగోలు చేసి మిల్లర్లకు తరలిస్తున్నట్టు ఆయన తెలి పారు. కొనుగోలు చేసిన వరిధాన్యంను కేంద్రాల్లో నిల్వ చేయకుండా సంబంధిత మిల్లర్‌లకు తరలిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.