బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచాలి

ABN , First Publish Date - 2021-05-05T05:53:48+05:30 IST

బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచాల్సిన అవసరం ఉన్నదని సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ఆధికారులకు సూచించారు.

బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు

- కొవిడ్‌ వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి

- జీఎంలతో సింగరేణి సీఎండీ శ్రీధర్‌ వీడియోకాన్ఫరెన్స్‌

గోదావరిఖని, మే 4: బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచాల్సిన అవసరం ఉన్నదని సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ఆధికారులకు సూచించారు. బొగ్గు ఉత్ప త్తి, ఉత్పాదకతలపై మంగవారం డైరెక్టర్లు బలరాం (పా,పీపీ, ఫైనాన్స్‌), చంద్రశేఖర్‌(ఆపరేషన్స్‌), సత్య నారాయణరావు(ఈఅండ్‌ఎం)లతోపాటు అన్ని ఏరి యాల జీఎంలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించా రు. ఏరియాల వారిగా ఉత్పత్తి, ఉత్పాదకతలు పెం చడానికి చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించారు. గనులు, ఓసీపీల నుంచి బొగ్గు రవాణా, ఓబీ తొల గింపు సంబంధించిన ఒప్పందాలు వాటి స్థితిగతు లు, జీడీకే-5 ప్రాజెక్టు పనులు, యంత్రాల వినియో గం, పనితీరుపై వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎండీ చ ర్చించారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ విషయాలు, కోల్‌వాషరీల పనితీరుపై చర్చించారు. ఏరియాల వారిగా జీఎంలకు వివిధ అంశాలపై సీఎండీ సూచ నలు చేశారు. వార్షిక లక్షాలను సాధించడానికి ప్రతి రోజు 1,90,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాలని, 13,000లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీ వెలికితీయాలని, 36 రేకుల బొగ్గు సరఫరా జరగాలని సూచించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, పనిస్థలాల్లో వైరస్‌ వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాల ని, కొవిడ్‌ వైద్య సేవలను పర్యవేక్షిస్తుండాలని సూ చించారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో అడ్వయిజర్‌ ప్రాజెక్ట్సు డీఎన్‌ ప్రసాద్‌, ఈడీ జే ఆల్విన్‌, జీఎం (సీపీఅండ్‌పీ) నాగభూషణరెడ్డి, జీఎం మార్కెటి ంగ్‌ సూర్యనారాయణలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-05T05:53:48+05:30 IST