సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటల అనుచరుడిపై కేసు
ABN , First Publish Date - 2021-05-21T17:23:34+05:30 IST
ముఖ్యమంత్రితో పాటు, జిల్లా..

నిందితుడి అరెస్టు
కరీంనగర్: ముఖ్యమంత్రితో పాటు, జిల్లా మంత్రి, టీఆర్ఎస్ ఫార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడని, సప్తగిరికాలనీ పెద్దమ్మ గుడిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతుగా విలేకరుల సమావేశం నిర్వహించాడని, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుచరుడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌కు చెందిన పోలు లక్ష్మణ్ ముదిరాజ్‌పై గురువారం కరీంనగర్ రెండో ఠాణాలో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఉత్తర తెలంగాణ భవన్‌ను స్వాధీనం చేసుకుంటామని, ప్రగతిభవన్‌పై రాళ్లదాడి చేస్తామంటూ పోలు లక్ష్మణ్ బెదిరింపులకు గురి చేశాడని, మంత్రి గంగుల కమలాకర్ ఈటల కాలిగోటికి కూడా సరిపోడంటూ అవమానకరంగా మాట్లాడాడని రాయనవేని శ్రవణ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలు లక్ష్మణ్ ముదిరాజ్‌పై ఐపీసీ సెక్షన్ 153, 505(2) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని కరీంనగర్ రెండో ఠాణా సీఐ టీ లక్ష్మిబాబు తెలిపారు.