ఉద్యోగుల బదిలీలపై స్పష్టత

ABN , First Publish Date - 2021-12-25T05:41:58+05:30 IST

కొత్త జోనళ్ల ప్రాతిపదికన ఏర్పడ్డ జిల్లాల వారీగా చేపడుతున్న ఉద్యోగుల బదిలీల్లో భాగంగా ఆయా జిల్లాలకు కేటాయించే ఉద్యోగు లకు ఇచ్చే పోస్టింగులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

ఉద్యోగుల బదిలీలపై స్పష్టత

- ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికే పోస్టింగులు  

- ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాల్లో ఎక్కడి వారక్కడే

- కేడర్‌ వారీగా సీనియారిటీ జాబితాల తయారీకి కసరత్తు  

- వేసవిలో చేపట్టనున్న సాధారణ బదిలీలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కొత్త జోనళ్ల ప్రాతిపదికన ఏర్పడ్డ జిల్లాల వారీగా చేపడుతున్న ఉద్యోగుల బదిలీల్లో భాగంగా ఆయా జిల్లాలకు కేటాయించే ఉద్యోగు లకు ఇచ్చే పోస్టింగులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఏదైతే ప్రస్తుత జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అదే జిల్లా అలాట్‌ అయినట్లయితే, సదరు ఉద్యోగి అదే పోస్టులో కొనసాగాల్సి ఉంటుంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులకు ఏర్పడ్డ ఖాళీ స్థానాల్లో పోస్టింగ్‌ ఇచ్చేందుకు మాత్రమే సీనియారిటీ ప్రాతి పదికన బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేయడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ పోస్టింగులు, బదిలీలు తాత్కాలికమే అయినప్పటికీ, వేసవి కాలంలో జిల్లాలో పని చేసే అందరు ఉద్యోగులకు బదిలీ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలను పునర్విభజించి 33 జిల్లాలను చేసింది. ఆ తదనంతరం మారు మూల ప్రాంతాల నిరుద్యోగులకు సైతం ఉద్యోగాలు దక్కే విధంగా 7 కొత్త జోనళ్లను ఏర్పాటు చేసింది. స్థానిక కోటాను 90 శాతానికి పెంచింది. కొత్తగా ఉద్యోగాల నోటిఫి కేషన్లు జారీ చేయాలంటే జిల్లాల వారీగా క్యాడర్‌ స్ర్తెంథ్‌ను ఖరారు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీసులకు ఆప్షన్లు ఇచ్చి బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఏడు జిల్లాలకు విస్తరించి ఉండడంతో ఇక్కడ పని చేసే ఉద్యోగులం దరు 7 జిల్లాల్లో ఆప్షన్లు పెట్టుకుని దరఖాస్తు చేసు కోగా శాఖల వారీగా కేటాయింపులు జరుగుతున్నా యి. విద్యా శాఖ మినహా అన్ని శాఖల ఉద్యోగులకు జిల్లాల వారీగా కేటాయింపులు పూర్తయి రిపోర్టు కూడా చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి జిల్లాకు వచ్చే ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వడం ఎలా, ఇదే జిల్లాలో పని చేస్తూ ఇక్కడికి అలాట్‌ అయిన ఉద్యోగులకు బదిలీ అవకాశం ఉంటుందా, ఉండదా అనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకింత ఆందోళనకు గుర య్యారు. జిల్లాలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో సగానికి పైగా ఇతర జిల్లాలకు బదిలీ అవుతున్నారు. ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడే పనిచేస్తూ ఇక్కడికే అలాట్‌ అయిన ఉద్యోగులు మాత్రం ప్రస్తుతం పని చేస్తున్న స్థానంలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత క్రమంలో ఖాళీ స్థానాలకు బదిలీ చేయనున్నారు. ఇదంతా ప్రస్తుతానికి తాత్కాలికమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మారుమూల ప్రాంతాల్లో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న ఉద్యోగులు మరికొద్ది రోజులు అక్కడే పని చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, వ్యవసాయ శాఖ, పోలీస్‌ శాఖ ఉద్యోగుల పోస్టులన్నీ జిల్లా, మండల స్థాయిలో ఉండగా, ఉపాధ్యాయుల పోస్టులు మాత్రం అన్ని గ్రామాల్లో ఉంటాయి. జిల్లాకు అలాట్‌ అయిన ఉపాధ్యాయులందరూ రిపోర్టు చేసిన తర్వాత కౌనెల్సింగ్‌ నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఇతర శాఖల ఉద్యోగులకు రెండు, మూడు రోజుల్లో అలాట్‌ చేయాలని అధికారులు భావిస్తున్నారు. సోమవారంకల్లా విద్యా శాఖ మినహా ఇతర శాఖల ఉద్యోగుల అలాట్‌ మెంట్‌, బదిలీలు పూర్తి కానున్నాయి. ఇతర జిల్లాలకు కేటాయించబడిన ఉద్యోగులు తమకు పోస్టింగ్‌ ఇచ్చిన తర్వాతనే పాత స్థానం నుంచి రిలీవ్‌ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతా నికి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. శనివారం క్రిస్మస్‌, ఆ తర్వాత ఆదివారం రెండు రోజులు వరుస సెలవులు వచ్చినప్పటికీ, ఈ రెండు రోజుల్లో కూడా ఉద్యోగుల అలాట్‌మెంట్‌, బదిలీల ప్రక్రియను చేప ట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో ఉద్యోగులకు పోస్టులను కేటాయించేందుకు జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, ఆయా శాఖల జిల్లా అధికారులు కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. 

Updated Date - 2021-12-25T05:41:58+05:30 IST