ఎన్టీపీసీని సందర్శించిన సీఐఎస్‌ఎఫ్‌ డీఐజీ

ABN , First Publish Date - 2021-12-26T06:08:41+05:30 IST

సీఐఎస్‌ఎఫ్‌ జోన్‌-2 హైదరాబాద్‌ డీఐజీ డి.శ్యామల శని వా రం రామగుండం ఎన్టీపీసీలో పర్యటించారు.

ఎన్టీపీసీని సందర్శించిన సీఐఎస్‌ఎఫ్‌ డీఐజీ
కొత్త క్వార్టర్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న డీఐజీ శ్యామల

జ్యోతినగర్‌, డిసెంబరు 25 : సీఐఎస్‌ఎఫ్‌ జోన్‌-2 హైదరాబాద్‌ డీఐజీ డి.శ్యామల శని వా రం రామగుండం ఎన్టీపీసీలో పర్యటించారు. ఉదయం ఇక్కడికి వ చ్చిన డీఐజీకి వీఐపీ గెస్ట్‌హౌజ్‌లో సీఐఎప్‌ఎఫ్‌ కమాండెంట్‌ సందీప్‌ కువూర్‌ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. వార్షిక తనిఖీలలో భాగంగా వచ్చిన ఆమె రామగుండం ప్రాజెక్టు, ఫ్లోటింగ్‌ సోలార్‌, యాష్‌పాండ్‌ తదితర విభాగాలను పరిశీలించారు. ఎన్టీపీసీలో సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న రక్షణ, భద్రత వ్యవస్థల పై ఆమె అధికారులతో సమీక్షించారు. అలాగే మల్కాపూర్‌ రోడ్డులో ని సీఐఎస్‌ఎఫ్‌ బ్యారక్స్‌లో డీఐజీ పర్యటన సందర్భంగా జవానులు నిర్వహించిన సెక్యురిటీ డ్రిల్‌ను ఆమె పరిశీలించారు. అనంతరం బ్యారక్స్‌లో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కోసం నిర్మిస్తున్న క్వార్టర్ల నిర్మాణ పనులను డీఐజీ శ్యామల పరిశీలించారు. ఆదివారం డీఐజీ సింగరేణిలో పర్యటించనున్నారు. 

Updated Date - 2021-12-26T06:08:41+05:30 IST