క్రిస్మస్ వేడుకలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-11-26T06:13:16+05:30 IST
ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చ్‌లలో గురువారం వేడుకలు ప్రారంభమయ్యాయి.

కరీంనగర్ కల్చరల్, నవంబరు 25: ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చ్‌లలో గురువారం వేడుకలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల ముందు నుంచి క్రిస్మస్ వేడుకలు మొదలవుతాయి. అన్ని చర్చ్‌లలో క్రిస్మస్ ట్రీల ఏర్పాటు, ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పలు చోట్ల క్రిస్మస్ జ్యోతి వెలిగించారు. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. నగరంలోని పురాతన సీఎస్‌ఐ వెస్లి కెథడ్రిల్ చర్చ్‌లో జరిగిన ప్రార్థనల్లో ఫాస్టరేట్ చైర్మన్ శ్రీనివాస్ నాయక్, సెక్రెటరీ అనిల్‌కుమార్, సభ్యులు పాల్గొన్నారు. క్రిస్టియన్ కాలనీలోని సెంటినరీ వెస్లి చర్చ్‌లో క్రీస్తు జనన సన్నివేశ సంగీత నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. క్వాయర్స్ బృందం కీర్తనలు ఆలపించారు.