పిల్లలకు పౌష్టికాహారం అందించాలి
ABN , First Publish Date - 2021-10-21T06:06:36+05:30 IST
జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదై ఉన్న ఐదు సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పౌష్టికాహారం అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు.

అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్
కరీంనగర్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదై ఉన్న ఐదు సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పౌష్టికాహారం అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పిల్లల పెరుగుదల పర్యవేక్షణపై ఐసీడీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ బరువు ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి మంగళవారం అన్ని ప్రాజెక్టుల్లోని అన్ని సెంటర్లలో గ్రోత్ మానిటరింగ్ డే నిర్వహించాలని ఆదేశించారు. మహిళా సంఘాల సహకారంతో ఎదుగుదల లేని పిల్లలకు ఐరన్ సంబంధిత ఆహార పదార్థాలను అందించాలని ఆదేశించారు. ప్రతి నెల నిర్వహించే మహిళా సంఘాల గ్రామసభల్లో పోషణ లోపంతో బాధపడుతున్న పిల్లల గురించిన ఏజెండా అంశంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పిల్లల వయస్సు కంటే తక్కువ బరువు ఉన్నట్లయితే న్యూట్రిషన్, రిహాబిలిటేషన్ సెంటర్‌కు తీసుకువెళ్లి చూపించాలని అన్నారు. గ్రామాల్లో పౌష్టికాహారంపై సదస్సులు ఏర్పాటు చేసి తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరుపై ప్రత్యేశ శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.