ఈవీఎంల గోదామును ప్రారంభించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి
ABN , First Publish Date - 2021-12-31T05:41:03+05:30 IST
ఎలక్షన్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాడ్ లను భద్రపరిచే గోదామును రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ప్రారం భించారు.

పెద్దపల్లి, డిసెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): ఎలక్షన్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాడ్ లను భద్రపరిచే గోదామును రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ప్రారం భించారు. గురువారం ఆయన పెద్దపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కు అదనపు కలెక్టర్లు వి లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్‌లు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగ తం పలికారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఈ గోదామును నిర్మించారు. ఈ సందర్భంగా ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా నిర్వ హించేందుకు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు ఉపయోగపడుతున్నాయన్నారు. బ్యాలెట్ పేపర్ల ఖర్చు లేకుండా, త్వరితగతిన కౌంటింగ్ నిర్వహించేందుకు ఈ యంత్రాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ యంత్రాలు చెడిపోకుండా కాపాడేందుకు ప్రత్యే కంగా ఒక గోదాము అవసరమన్నారు. అందులో భాగంగా ఇక్కడ కొత్తగా నిర్మించిన గోదాములో యంత్రాలను భద్రపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ పులిగిళ్ల రవీందర్, తహసీల్దార్ డి శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ తూము రవీందర్, ఎన్నికల విభాగం డీటీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.