పద్ధతి మార్చుకుని వాస్తవాలు మాట్లాడాలి

ABN , First Publish Date - 2021-02-05T06:09:16+05:30 IST

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిపై మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత తన పద్ధతి మార్చుకుని తక్షణమే ఎమ్మెల్సీకి క్షమాపణ చెప్పాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు.

పద్ధతి మార్చుకుని వాస్తవాలు మాట్లాడాలి
సమావేశంలో మాట్లాడుతున్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

 కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, పిభ్రవరి 4 : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిపై మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత తన పద్ధతి మార్చుకుని తక్షణమే ఎమ్మెల్సీకి క్షమాపణ చెప్పాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. గురు వారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. జి ల్లా పరిషత్‌ ఆస్థులను కూల్చే విషయంతో పాటు, నూతన కట్టడాల విష యంలో జడ్పీ స్టాండింగ్‌ కమిటీలో చర్చకు తీసుకరావాలనే విషయం కుడా తెలియకుండా జడ్పీ అధ్యక్షురాలు మాట్లాడడం అవివేకమన్నారు. ఆరు తర గతి గదులను ఇంజనీరింగ్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు పర్యవేక్షణ లేకుండా జిల్లా విధ్యాధికారి, కలెక్టర్‌ అనుమతులు లేకుండా ఎలా కూల్చివేసారో స మాధానం చెప్పాలన్నారు. ఈ విషయంలో రాత్రికి రాత్రే సృష్టించిన కాగి తాలు, తీర్మాణాల విషయంలో జిల్లా పరిషత్‌ సీఈవోతో పాటు జడ్పీ చైర్‌ పర్సన్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీపీసీ సీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శంకర్‌, నాయకులు రాజేంధర్‌, అశోక్‌, భాస్కర్‌ రెడ్డి, దుర్గయ్య, మధు, జీవన్‌, విజయ్‌, రాజేష్‌, రియాజ్‌, నేహాల్‌ ఉన్నారు.


Updated Date - 2021-02-05T06:09:16+05:30 IST