ముగిసిన సెస్టోబాల్‌ జాతీయ స్థాయి పోటీలు

ABN , First Publish Date - 2021-11-09T05:43:19+05:30 IST

రెండు రోజులుగా కాలనీలోని సింగరేణి స్కూల్‌లో జరు గుతున్న సెస్టోబాల్‌ ఫెడరేషన్‌ కప్‌-2021 పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి.

ముగిసిన సెస్టోబాల్‌ జాతీయ స్థాయి పోటీలు
గెలిచిన జట్టుతో ఏసీపీ, ఇతర అతిథులు

యైుటింక్లయిన్‌కాలనీ, నవంబరు 8: రెండు రోజులుగా కాలనీలోని సింగరేణి స్కూల్‌లో జరు గుతున్న సెస్టోబాల్‌ ఫెడరేషన్‌ కప్‌-2021 పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల నుండి జట్లు పాల్గొన్నా యి. పంజాబ్‌, హర్యాన, ముంబై, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ముంబై, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుండి పురుషులు, మహిళా జట్లు పాల్గొన్నాయి. మహి ళా విభాగంలో 25, పురుషుల విభాగంలో 25 మ్యాచ్‌లు జరిగాయి. ఈ పోటీల్లో హోరాహోరీగా జట్లు తలపడ్డాయి. బాలుర విభాగంలో కర్ణాటక ప్రథమ, ఉత్తరప్రదేశ్‌ ద్వితీయ స్థానాల్లో నిలిచా యి. బాలికల విభాగంలో పంజాబ్‌ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేష్‌ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర తృతీయ స్థానాన్ని తెలంగాణ, మహారాష్ట్ర జట్లు, బాలికల తృతీయ స్థానాన్ని కర్ణాటక, మహారాష్ట్ర జట్లు సంయుక్తంగా నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌ ముఖ్యఅతిథిగా హాజరై విజేత లకు బహుమతులను అందజేశారు. గెలిచిన జట్ల సభ్యులకు ఏసీపీ అభినందనలు తెలియజేశారు. టూటౌన్‌ సీఐ శ్రీనివాసరావు, ఆర్జీ-2 ఎస్వోటూ జీ ఎం సాంబయ్య, సెస్టోబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండి యా సెక్రటరీ జనరల్‌ మహమ్మద్‌ హకీం, సౌత్‌ జోన్‌ చైర్మన్‌ జక్కుల దామోదర్‌రావు, అయిలి శ్రీ నివాస్‌, శంకర్‌నాయక్‌, కేశవరెడ్డి, టంగుటూరి రా జయ్య, పాశం ఓదేలు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T05:43:19+05:30 IST