రైతుల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2021-01-21T05:21:32+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ల నడ్డి విరుస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

రైతుల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
చెంజర్లలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

మానకొండూర్‌, జనవరి 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ల నడ్డి విరుస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. మండలంలోని చెంజర్ల, కొండపల్కలలో బుధవారం పల్లెపల్లెకు సీపీఐ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో  ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రప్రభుత్వం తీసుకవచ్చిన రైతు వ్వతిరేక చట్టాలు రైతులకు ఉరితాళ్లుగా మారాయన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కల్లిబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిఎన్నికల హమీలను నెరవేర్చలేదన్నారు. చెంజర్లలోని భూసమస్యల పరిష్కారానికి కలెక్టర్‌తో చర్చిస్తానని హమీ ఇచ్చారు. 26న కరీంనగర్‌లో జరిగే ట్రాక్టర్‌ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, సహాయ కార్యదర్శి సృజన్‌కుమార్‌, మండల కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాముల చంద్రమౌళి, సంగు రవి, ఎరగొండ సదానందం, పంది రాజు, మద్ది కొమురయ్య పాల్గొన్నారు.   

Updated Date - 2021-01-21T05:21:32+05:30 IST