జిల్లాలో రైల్వేలైన్ కోసం నిధులు కేటాయించిన కేంద్రం
ABN , First Publish Date - 2021-02-07T05:22:17+05:30 IST
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 6: కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. శనివారం కొత్తపల్లి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకంచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంపీ బండి సంజయ్ నియోజక వర్గం అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం 325కోట్ల నిధులు కేటాయించారన్నారు. అదే విధంగా కరీంనగర్ వరంగల్ రహదారి నిర్మాణం కోసం రూ.43కోట్ల నిధులు మంజూరు చేయించారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఎంపీని విమర్శించడం మానుకొని అభివృద్ధి కోసం కలిసి రావాలని హితవు పలికారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, కొత్తపల్లి పట్టణ అధ్యక్షుడు కెంచ శేఖర్, కడార్ల రతన్, గజ రమేష్, నరహరి లక్ష్మారెడ్డి, హరీష్, హరిప్రసాద్, భారతం అభిలాష్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.