ఆగని వైరస్ ఉధృతి
ABN , First Publish Date - 2021-05-21T06:21:15+05:30 IST
కరోనా వైరస్ ఉధృతి ఆగడం లేదు. నిత్యం కరో నా కేసులు భయపెడుతుండగా మరోవైపు మరణాలు విషాదాన్ని నింపుతు న్నాయి.

- జిల్లాలో తాజాగా 202 మందికి పాజిటివ్
- ఆరుగురు మృతి
- 24 గంటల వ్యవధిలో తల్లీకొడుకుల మృతి
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల):
కరోనా వైరస్ ఉధృతి ఆగడం లేదు. నిత్యం కరో నా కేసులు భయపెడుతుండగా మరోవైపు మరణాలు విషాదాన్ని నింపుతు న్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం 600 మందికి ర్యాపిడ్ పరీక్ష లు చేయగా 202 మంది పాజిటీవ్ బారిన పడ్డారు. ఆరుగురు మృతి చెం దారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు చెందిన తల్లీ కొడుకులు 24 గంటల వ్యవధిలో కరోనాతో మృతి చెందారు. బుధవారం 40 సంవత్సరాల కొడుకు మృతి చెందగా, గురువారం 70 సంవత్సరాల తల్లి ఒకే ఆసుపత్రి లో మృత్యువాతపడ్డారు. ఎల్లారెడ్డిపేటకు చెందిన 28 ఏండ్ల యువకుడు, ఇ ల్లంతకుంటకు చెందిన 29 ఏండ్ల యువకుడు హైదరాబాద్‌లో చికిత్స పొం దుతూ మృతి చెందారు. ముస్తాబాద్ మండలానికి చెందిన 65 ఏళ్ల వ్యక్తి, వేములవాడకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి, ఎల్లారెడ్డిపేటకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు, సిరిసిల్లకు చెందిన 53 ఏళ్ల వ్యక్తి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జిల్లాలో 26,678 మంది కొవిడ్ బారిన పడగా, 20,275 మంది కోలుకున్నారు. 4,029 మంది చికిత్స పొందుతు న్నారు. ఇప్పటి వరకు 372 మంది మృతి చెందారు.