వ్యక్తిగత లాభం కోసమే ఉపఎన్నిక

ABN , First Publish Date - 2021-10-08T04:59:54+05:30 IST

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో వ్యక్తిగత లాభం కోసం ఉప ఎన్నికను తెచ్చారని కాం గ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ అన్నారు.

వ్యక్తిగత లాభం కోసమే ఉపఎన్నిక
మాట్లాడుతున్న బల్మూరి వెంకట్‌

కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌

హుజూరాబాద్‌ రూరల్‌, అక్టోబరు 7: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో వ్యక్తిగత లాభం కోసం ఉప ఎన్నికను తెచ్చారని కాం గ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ అన్నారు. గురు వారం బల్మూరి వెంకట్‌ తొలిసారిగా హుజూ రాబాద్‌ నియోజకవర్గానికి రాగా కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గల్లీలో లొల్లి.. ఢిల్లీలో దోస్తితో టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయ కులు వ్యవహరిస్తున్నారన్నారు. నియోజక వర్గంలో 37 వేల మంది నిరుద్యోగుల పక్షాన ఈ ఎన్నికలో పోటీ చేస్తానని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో అంతర్గత కుమ్మలాటల వల్ల ఎన్నికలు వచ్చా యన్నారు. 

ప్రజలు ఆశీర్వ దించి గెలిపిస్తే హుజూ రాబాద్‌ నియో జకవర్గ అభివృద్ధి కోసం పాటు పడు తానన్నారు.  ప్రజలు మార్పు కోరుకుంటున్నా రని, ఈ  ఉప ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌, బీజేపీలకు  గుణపాఠం తప్ప దన్నారు. కార్యక్ర మంలో జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, మడలాధ్యక్షు డు కొల్లూరి కిరణ్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-08T04:59:54+05:30 IST