ఉద్యమాలతోనే ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-12-19T05:50:41+05:30 IST

ఉద్యమాలతోనే ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వే యడం సాధ్యమని ఐఎన్‌టీయూసీ జాతీయ కార్య దర్శి, ఎన్టీపీసీ గుర్తింపు యూనియన్‌ సెక్రెటరీ జన రల్‌ బాబర్‌ సలీంపాషా స్పష్టం చేశారు.

ఉద్యమాలతోనే ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు బ్రేక్‌
విలేకరులతో మాట్లాడుతున్న బాబర్‌

- ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్‌

జ్యోతినగర్‌, డిసెంబరు 18 : ఉద్యమాలతోనే ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వే యడం సాధ్యమని ఐఎన్‌టీయూసీ జాతీయ కార్య దర్శి, ఎన్టీపీసీ గుర్తింపు యూనియన్‌ సెక్రెటరీ జన రల్‌ బాబర్‌ సలీంపాషా స్పష్టం చేశారు. శనివారం ఎన్టీపీసీలోని యూనియన్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందని, ఆ స్తులను అమ్ముతోందన్నారు. దశాబ్దాల కాలంగా దేశీయ ఆర్థికరంగాన్ని పరిపుష్ఠం చేయడంలో దోహ దపడిన అనేక సంస్థలను కార్పొరేట్‌, బడా వ్యాపా రులకు ధారాదత్తం చేస్తోందని తెలిపారు. విద్యుత్‌, ఆయిల్‌, విమాన, బీమా, బ్యాంకులను ప్రైవేటీకరిం చడం వల్ల కోట్లాది మంది కార్మికుల ఉపాధి కోల్పో యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక వైపు ప్రైవేటీకరణ చేయడంతోపాటు ఎన్‌డీఏ సర్కా రు కార్మిక చట్టాలను సమూలంగా మార్చి లేబర్‌ కోడ్లను తీసుకువస్తోందన్నారు. దీంతో ఎన్నో ఉద్య మాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులు కో ల్పోవాల్సి వస్తుందని, 8 గంటల పని విధానం, సమ్మెచేసే హక్కును కార్మికులు కోల్పోతారని పేర్కొ న్నారు. కేంద్రం చర్యల వల్ల ట్రేడ్‌ యూనియన్ల ఉనికికే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వ పారిశ్రామిక, కార్మిక, ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ప్రభుత్వంపై పోరుబాటకు దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాలు నడుంబిగించాయని బాబర్‌ తెలి పారు. ఫిబ్రవరి 24, 25లో రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు శుక్రవారం జరిగిన వర్చువల్‌ సమావేశం లో బీఎంఎస్‌ మినహా అన్ని యూనియన్ల పిలుపు నిచ్చాయన్నారు. ఈ సమ్మెలో కారిమకులతోపాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని ఆయన కో రారు. సమ్మెను సక్సెస్‌ చేయడం ద్వారా కేంద్రానికి గుణపాఠం చెప్పాలన్నారు. 

ఎన్టీపీసీలో కొత్త నియామకాలు చేపట్టాలి

గత కొన్నేళ్లుగా ఎన్టీపీసీ సంస్థలో ఉద్యోగ ఖాళీ లు భర్తీ చేయడం లేదని, దీంతో కార్మికులపై తీవ్ర మైన పనిభారం పెరుగుతోందని బాబర్‌ సలీంపా షా తెలిపారు. రామ గుండం ఎన్టీపీసీలో తక్షణం ఐటీఐ, డిప్లో మా సంబంధిత పో స్టులను భర్తీ చేయా లని ఆయన డిమాం డ్‌చేశారు. ప్రతి నెలా పదుల సంఖ్యలో కా ర్మికులు పదవీ విర మణ చేస్తున్నప్పటికీ కొత్తగా నియామకా లు చేపట్టకపోవడం శోఛనీయమన్నారు. గతంలో గుర్తింపుసం ఘంగా పని చేసిన హెచ్‌ఎంఎస్‌ యాజమాన్యానికి వత్తాసు పలికి ఉ ద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహ రించిందని ఆరోపించారు. స్పోర్ట్స్‌ కౌన్సిల్‌, రిక్రియేష న్‌ క్లబ్‌, గ్యాస్‌ఏజెన్సీ నిర్వహణలో ఉద్యోగుల ప్రాధా న్యత లేకుండా హెచ్‌ఎంఎస్‌ చేసిందని, రానున్న రోజుల్లో పూర్వ వైభవం తీసుకు వస్తామన్నారు. దసరా ఎక్స్‌గ్రేషియా చెల్లింపులవిషయంలో బీఎం ఎస్‌ లేని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంద న్నారు. విలేకరుల సమావేశంలో గుర్తింపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కందుల స్వామి, బండారు కనకయ్య, నాయకు ఆరెపల్లి లక్ష్మీనారాయణ తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-19T05:50:41+05:30 IST